Pfizer Coronavirus Vaccine : ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ డోసులు పంపిణీ అంటున్న ఫైజర్

యునైటెడ్ స్టేట్స్ ఆధారిత సంస్థ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ తమ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను భారతదేశంలోని ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే సరఫరా చేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.

Pfizer Coronavirus Vaccine : ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ డోసులు పంపిణీ అంటున్న ఫైజర్

Pfizer Coronavirus Vaccine

Updated On : April 22, 2021 / 6:06 PM IST

Pfizer Coronavirus Vaccine : యునైటెడ్ స్టేట్స్ ఆధారిత సంస్థ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ తమ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను భారతదేశంలోని ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే సరఫరా చేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ మోతాదులను విక్రయించకపోతే వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉండదని పేర్కొంది. దేశంలో ప్రభుత్వ రోగనిరోధకత కార్యక్రమంలో భాగంగా ఫైజర్, బయోఎంటెక్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేలా ఫైజర్ కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధి అన్నారు.

కరోనా వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించడానికి కంపెనీలను అనుమతించే విషయంలో భారత్ టీకాల పంపిణీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ సంస్థలకు టీకా అమ్మకాలను అనుమతించాలన్న కేంద్రం నిర్ణయానికి ముందే ఫైజర్ ఈ ప్రకటన చేసింది. ప్రభుత్వ సంబంధిత అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టులు ద్వారా ఫైజర్ Covid -19 టీకా సరఫరా చేస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. గత డిసెంబర్ 4న భారతదేశానికి కోవిడ్-19 వ్యాక్సిన్ పరిమితిపై అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తును సమర్పించింది. అప్పుడు యూకేలో అత్యవసర వినియోగంపై ఆమోదాన్ని పొందింది.

భారత్‌లో స్థానిక పరీక్షలను నిర్వహించనప్పటికీ.. క్లినికల్ ట్రయల్ రూల్స్, 2019 ప్రకారం.. నిబంధనలు పరీక్షలు నిర్వహించకుండానే అనుమతి పొందటానికి ఫైజర్‌కు అనుమతి లభించింది. వ్యాక్సిన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించిన విదేశీ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందింది. ఫిబ్రవరి 5న భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం భద్రతా సమస్యలను లేవనెత్తారు. దాంతో ఫైజర్ తమ దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ జనాభా కోసం బయోటెక్నాలజీ సంస్థ బయోఎంటెక్‌తో అభివృద్ధి చేసిన టీకా భద్రతను నిరూపించడానికి లోకల్ ట్రయల్స్ నిర్వహించాలని అమెరికాకు చెందిన సంస్థను కోరింది.

భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ-ఉత్పత్తి వ్యాక్సిన్ల కోసం అత్యవసర ఆమోదాలను వేగంగా గుర్తించే నిర్ణయాన్ని కేంద్రం ఫిబ్రవరి 13న ప్రకటించింది. దాంతో ఫైజర్‌తో సహా అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీదారులను వీలైనంత త్వరగా ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. భారతదేశంలో గురువారం నాటికి 3,14,835 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 2020 జనవరిలో మహమ్మారి సంభవించినప్పటి నుండి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకుంది. 2,104 మరణాలు నమోదు కావడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,84,657కు చేరింది. దేశంలో వరుసగా ఎనిమిదో రోజు 2 లక్షలపైనా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.