కరోనా పేషెంట్లను చంపేయాలని బస్సుపై దాడి

కరోనా పేషెంట్లను చంపేయాలని బస్సుపై దాడి

Updated On : February 21, 2020 / 7:51 AM IST

ఉక్రెయిన్‌లో కరోనా పేషెంట్లు అంటూ డజన్ల కొద్దీ ఆందోళనకారులు బస్సుపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ పోల్టవా అనే ప్రాంతంలో 14రోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న వారిని బస్సు ద్వారా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఆందోళనకారులు కరోనా వైరస్ ఉన్న వాళ్లు బతికుండటానికి వీల్లేదంటూ రాళ్లతో దాడి చేశారు. నిజానికి బస్సులో ఉన్న వారికి కరోనా లక్షణాలు ఏమీ లేవు. అనుమానంతో హాస్పిటల్‌లో ఉంచుకుని చికిత్స అందించారు. 

ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్బీయూ) నుంచి ఫేక్ ఈమెయిల్‌తో తప్పుడు సమాచారం అందించింది. దీనిపై ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి జోర్యానా స్కాలెస్కా స్కైప్ ద్వారా ఆందోళనకారులతో మాట్లాడి నిజాలను వెల్లడించారు. ‘నోవీ సంఝారీ హాస్పిటల్ లో జరిగిన ఆందోళన ఇప్పటికైనా ప్రశాంతం అవుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. 

గురువారం 45 ఉక్రెనియా వాసులు, 27మంది విదేశీయులు వుహాన్ నుంచి ఖార్కివ్ ప్రాంతానికి వచ్చారు. వారందరినీ ఆరు బస్సుల్లో నోవి సంఝారీ హాస్పిటల్‌కు టెస్టుల నిమిత్తం తీసుకొచ్చారు. వారందరినీ పరిశీలనలో ఉంచి 14రోజుల తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. 

వుహాన్ నుంచి వచ్చినందుకు అనుమానంతోనే ఇలా చేశామని నిజానికి ఎవరూ కరోనా రోగులు కాదని ఆరోగ్య శాఖ చెప్పింది. ‘ప్రయాణికుల్లో చాలా మంది 30ఏళ్లలోపు వారే. మనమంతా మనుషులమే. వుహాన్ లో ప్రాణాలు వదిలిన వారు కూడా మనలాంటి వాళ్లేనని గుర్తుంచుకోవాలి’ అని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 76 వేల కోవిడ్-19 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2వేల 247మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 

Read More>>జర్మనీలో ఉన్మాది కాల్పులు..తొమ్మిది మంది మృతి : తల్లిని కూడా చంపేశాడు