మోడెర్నా, ఫైజర్‌ కంటే మా వ్యాక్సిన్ ధర చాలా తక్కువ.. రష్యా ఆసక్తికర ప్రకటన

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 03:46 PM IST
మోడెర్నా, ఫైజర్‌ కంటే మా వ్యాక్సిన్ ధర చాలా తక్కువ.. రష్యా ఆసక్తికర ప్రకటన

Updated On : November 24, 2020 / 4:03 PM IST

Sputnik V vaccine: మోడెర్నా, ఫైజర్ టీకాల కంటే తమ వ్యాక్సిన్ ధర తక్కువగానే ఉంటుందని స్పుత్నిక్-వీ తయారీ సంస్థ ప్రకటించింది. ఫైజర్‌ టీకా ధర ఒక వెయ్యి 400 రూపాయలుగా .. మోడెర్నా ధర 2 వేల రూపాయలుగా ఉండనున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఇవి రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైజర్‌ టీకా ధర 3 వేల రూపాయలు, మోడెర్నా టీకా ధర 4 వేల రూపాయలు అవుతుంది.

అయితే, స్పుత్నిక్‌-వి టీకా ధర మాత్రం ఈ రెండింటి కంటే చాలా తక్కువగానే ఉంటుందని వ్యాక్సిన్‌ రూపకర్తలు ప్రకటించారు. అయితే ధర ఎంత ఉంటుందని మాత్రం వెల్లడించలేదు.
https://10tv.in/corona-third-wave-danger-for-europe-countries/
రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అక్కడి RDIF సహకారంతో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు నెలలో రిజిస్టర్‌ చేసుకున్న స్పుత్నిక్‌ టీకా యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

అంతేకాకుండా మూడో దశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ 92శాతం సమర్థత కనబరిచినట్లు మధ్యంతర ఫలితాలను సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ధరల విషయంలో కూడా స్పుత్నిక్‌-వీ మరో ముందడుగు వేసింది. మిగతా టీకాల కంటే తమది చాలా తక్కువ ధర ఉంటుందని ఆసక్తికర ప్రకటన చేసింది.