మీలో తలనొప్పి, మైగ్రేన్ తరచూ వస్తోందా? కొవిడ్-19 కారణం కావొచ్చు..!

కోవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మీలో తలనొప్పి లేదా మైగ్రేన్? తరచుగా సమస్యలు వేధిస్తున్నాయా? దీనికి కారణం మహమ్మారి కరోనానే.. అదే మిమ్మల్ని మానసికంగా ప్రేరేపిస్తోంది. కరోనా భయంతో కార్యాచరణ లేకపోవడం, నిద్ర విధానాలు ప్రభావితం కావడం, డీహైడ్రేట్ అవడం, ఇంటి నుంచి కూర్చొని గంటల పాటు పని చేయడం వంటివి ఆలోచనల కారణంగా కష్టంగా మారుతోంది. తద్వారా జనరల్ వీక్ నెస్ ఏర్పడి నీరసంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న.. నాకు కోవిడ్ -19 ఉందా?
కోవిడ్ -19 లక్షణాల్లో తలనొప్పి కూడా ఇలానే చాలా తీవ్రంగా ఉంటుందని, సాధారణంగా దగ్గు, జ్వరాలతో మరింత తలనొప్పి తీవ్రమవుతుంది” అని చికాగో డైమండ్ Headache Clinic అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ Merle Diamond చెప్పారు.వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే ముందుగా స్పందించే రోగనిరోధక వ్యవస్థ దానిలోని సైటోకిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది.
ఆ సమయంలో సైటోకిన్లు మంటను ఉత్పత్తి చేస్తాయి. మెదడు సెరిబ్రల్ కార్టెక్స్ ద్వారా తలనొప్పిగా మారుతుంది. అదే మైగ్రేన్ విషయానికి వస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. స్వల్పంగా మొదలై తీవ్రంగా మారుతుంది. చిన్న కాంతి పడినా లేదా శబ్దం విన్నా కూడా భరించలేనంతగా అనిపిస్తుంది. వాంతి వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అసలు మైగ్రేన్ అనేది అనారోగ్యకరమైన తలనొప్పిగా డైమండ్ అభివర్ణించారు.
తమ మెదడు వారి పుర్రె కంటే చాలా పెద్దదిగా అనిపిస్తుందనే భావన రోగుల్లో కలుగుతుందని ఆయన చెప్పారు. సాధారణంగా మైగ్రేన్ హ్యాంగోవర్ దాదాపు 8 గంటలు, 12 గంటలు లేదా 14 గంటలు ఉండవచ్చు. స్థిరమైన లేదా స్వల్పంగా తలనొప్పి లేదా మైగ్రేన్లతో బాధపడుతున్న ఎవరైనా వైద్యం కోసం headache specialist నిపుణుడిని సంప్రదించాలని చెప్పారు.
తలనొప్పిని అరికట్టగల నివారణలు కూడా ఉన్నాయి: ఎప్పుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. లేచి, ఊపిరి బాగా తీసుకోవాలి. ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. తినడం, శరీరాన్ని కదిలించడం, వ్యాయామం, సమయానికి భోజనం చేయడం, కంటి నిండా నిద్రోవడం ఇలా ఆరోగ్యకరమైన రెగ్యులర్ షెడ్యూల్ తప్పక పాటించాలి. అప్పుడే తలనొప్పి, మైగ్రేన్ వంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.