Dog : నేను ఈత కొట్టగలను, స్విమ్మింగ్ పూల్‌లో కుక్క
ఓ అందమైన కుక్క స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. కొలనులో దిగే ముందు కుక్క తీసుకున్న జాగ్రత్తలు అందర్నీ ఆకర్షిస్తోంది. నిచ్చెన పైకి ఎక్కేటప్పుడు తోక అటూ ఇటూ ఆడించింది. అనంతరం మెల్లిగా మెట్లు ఎక్కుతూ..అతి జాగ్రత్తగా అటూ ఇటూ చూసింది.

Dog
Dog Learned How To Get Into Pool : ఓ అందమైన కుక్క స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. కొలనులో దిగే ముందు కుక్క తీసుకున్న జాగ్రత్తలు అందర్నీ ఆకర్షిస్తోంది. నిచ్చెన పైకి ఎక్కేటప్పుడు తోక అటూ ఇటూ ఆడించింది. అనంతరం మెల్లిగా మెట్లు ఎక్కుతూ..అతి జాగ్రత్తగా అటూ ఇటూ చూసింది. అనంతరం నోటిని నీటిని అటూ ఇటూ కదిపింది. అనంతరం మెల్లిగా స్విమ్మింగ్ పూల్ లో దూకి..ఈత కొడుతూ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో జూలై 04వ తేదీన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Read More : Bangladesh PM : మోదీ,దీదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని
అప్ లోడ్ అయిన ఆరు గంటల్లోనే…8.7k వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేశారు. కుక్క ఎలా ఈత కొట్టింది..ఎలా వెళ్లింది..లాస్ట్ వరకు వీడియో చూశామని వెల్లడిస్తున్నారు. అయితే..జంతువులను అలా పూల్ దగ్గర వదిలివేయడంపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తాను చాలా భయపడ్డానని, దయచేసి జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కుక్క ఈత కొట్టి..సేఫ్ గా బయటకు రావడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.