H-1B వీసాదారులకు గుడ్ న్యూస్… ఆంక్షలు సడలించిన ట్రంప్ సర్కార్

హెచ్1బీ వీసా నిబంధనల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది.హెచ్1బీ వీసాలపై ఇటీవల ఈ ఏడాది చివరి వరకు తాత్కాలిక నిషేధం విధించిన ట్రంప్ సర్కార్.. తాజాగా పలు ఆంక్షలను సడలించింది. నిషేధ ప్రకటనకు ముందు చేసిన ఉద్యోగాల కోసం.. తిరిగి రావాలనుకునే వీసాహోల్డర్లు తిరిగి అమెరికా వచ్చేందుకు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అడ్వైజరీ తెలిపింది. హెచ్-1బీ, ఎల్1 వీసాలు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది
విదేశాలలో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు. అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించినట్టు తెలిపారు. ప్రాధమిక వీసాదారులతో పాటు డిపెండెంట్లు (జీవిత భాగస్వాములు, పిల్లలు) కూడా అనుమతినిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది. గతంలో దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని తెలిపింది. తిరిగి ఆ ఉద్యోగాల్లోనే పనిచేసేందుకు వస్తేనే వారికి అమెరికా రావడానికి అనుమతి ఉంటుంది. అంటే గతంలో పనిచేసిన ఉద్యోగాల్లో మళ్లీ పనిచేయడానికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది.అంతేకాదు పబ్లిక్ హెల్త్ లేదా హెల్త్‌కేర్ సిబ్బంది, మెడికల్ రీసెర్చర్ లాంటివారికి అనుమతిస్తోంది. కరోనా మహమ్మారి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. భారతదేశం నుంచి వేలాది మంది హెచ్-1బీ వీసాలతో వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవిషయం తెలిసిందే.
అమెరికాలోని కంపెనీల్లో ప్రత్యేక పోస్టుల్లో విదేశీయులు తాత్కాలికంగా పనిచేయాలంటే హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రంట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్-1బీ వీసాలను ఇస్తుంది అమెరికా ప్రభుత్వం. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను ఆఫర్ చేస్తుంటాయి. భారతదేశం నుంచి వేలాది మంది హెచ్-1బీ వీసాలతో వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవిషయం తెలిసిందే.