Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 3లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు ఎఫెక్ట్ .. హెచ్1బీ వీసాలకోసం పరుగులు..
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ రూల్స్ ను కఠినతరం చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ..

Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అమెరికాలో నివసిస్తున్న ప్రపంచ దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువే. అందులోనూ తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విద్యనభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ట్రంప్ రోజుకో రూల్ ను అమల్లోకి తెస్తుండటంతో వారంతా అమెరికా విడిచి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. టారిఫ్ లకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు రయ్..
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ రూల్స్ ను కఠినతరం చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థులకు వర్క్ వీసాల రద్దు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. దీంతో అమెరికాలో ఎఫ్1, ఎం1 వీసాలతో ఉంటున్న విద్యార్థులు హెచ్1బీ వీసాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓపీటీ ప్రోగ్రాంను రద్దుచేసే యోచనలో..
అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో చదువుతున్న విదేశీ స్టూడెంట్లకు చదువు అయిపోయిన తరువాత కొన్నేళ్లపాటు అక్కడే పనిచేసుకునేందుకు వీలుగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రాం కింద ఇచ్చే వర్క్ వీసాలతో ఇండియన్ స్టూడెంట్లు చదువు అయిపోయిన తరువాత మూడు నాలుగేళ్లు పనిచేసి, తమ ఎడ్యుకేషన్ లోన్లను కట్టుకుంటున్నారు. కానీ, ఇప్పుడు స్టూడెంట్లకు వర్క్ వీసాలను అందించే ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది. ఇందుకోసం అమెకన్ కాంగ్రెస్ లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
3లక్షల మంది విద్యార్థులకు ఎఫెక్ట్..
ఓపీటీ ప్రోగ్రాంను రద్దుచేస్తూ అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ఆమోదం పొందితే సుమారు 3లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఓపీటీ ప్రోగ్రాంను ఎక్కువగా భారతీయ విద్యార్థులే వినియోగించుకున్నారు. 2023-24లో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రాంతో లబ్ధిపొందారు. ఓపీటీ రద్దయితే భారతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన వెంటనే అమెరికాను విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ఎఫ్1, ఎం1 వీసాలతో ఉంటున్న విద్యార్థులు హెచ్1బీ వీసాలు పొందితే పనిచేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ, హెచ్1బీ వీసాలు చాలా తక్కువ సంఖ్యలోనే జారీ అవుతాయి.