Trump’s 200% Tariff Threat on Pharma: ఇండియాపై ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై ఏకంగా 200 శాతం టారిఫ్?.. అదే జరిగితే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్ ఇప్పుడు మరో ముఖ్యమైన ఫార్మా మీద పడ్డారు.

Trump’s 200% Tariff Threat on Pharma
Trump’s 200% Tariff Threat on Pharma: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్ ఇప్పుడు మరో ముఖ్యమైన ఫార్మా మీద పడ్డారు. ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం టారిఫ్ లు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. ఇప్పటి వరకు చాలా మెడిసిన్ ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు 200 శాతం సుంకాలు విధిస్తే భారత్ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: Donald Trump: వన్ సైడెడ్ డిజాస్టర్.. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది.. భారత్‌పై మరోసారి ట్రంప్ దాడి..!
అమెరికా వాణిజ్య విస్తరణ చట్టం 1962లోని సెక్షన్ 232ని ఆ దేశం సవరించింది. అమెరికా భద్రతా కారణాలతో దీన్ని సవరించింది. అమెరికాలో వినియోగించే డ్రగ్స్ ను అమెరికాలోనే తయారు చేసుకోవడానికి ప్రోత్సాహం అందించడం దీని లక్ష్యం. అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల మీద సుంకాలు విధించడానికి రూట్ క్లియర్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత అమెరికాలో మెడిసిన్ వినియోగం పెరగడంతో ఉత్పత్తి ఆ స్థాయిలో పెరగలేదు. దీంతో దిగుమతులపై ఆధారపడింది. ఇప్పుడు మళ్లీ అమెరికాలోనే డ్రగ్స్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది.
ఫార్మాపై టారిఫ్ విధిస్తే ఏమవుతుంది?
ఒకవేళ భారత్ నుంచి దిగుమతి అయ్యే మందుల మీద అమెరికా సుంకాలు విధిస్తే ఎక్కువగా ఇబ్బంది పడేది సగటు అమెరికా ప్రజలు, ముసలి వాళ్లే. ఒకవేళ 25 శాతం టారిఫ్ విధిస్తే అప్పుడు మందుల ధరలు సుమారు 10 శాతం నుంచి 14 శాతం వరకు పెరుగుతాయి. అది సగటు అమెరికన్ మీద, వృద్ధుల మీద తీవ్ర ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉంది. అమెరికాలో 90శాతం మంది జనరిక్ మెడిసన్ నే రాస్తారు. అంటే జనరిక్ మెడిసిన్ తయారు చేసే కంపెనీల ఎగుమతుల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది.
ఇండియాకి నష్టం ఏంటి?
ఇండియా నుంచి జనరిక్ మెడిసిన్ పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి అవుతోంది. గతంలో టారిఫ్ లు విధించినప్పుడు ఈ ఫార్మా రంగాన్ని ట్రంప్ వదిలిపెట్టారు. టారిఫ్ ల పరిధిలోకి తీసుకురాలేదు. ఇప్పుడు వాటి మీద కూడా టారిఫ్ లు విధించడానికి రెడీ అయ్యారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇండియా, చైనా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఫార్మా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వీటిలో పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి మీద టారిఫ్ విధిస్తే ఆయా దేశాల నుంచి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది.
సొంతంగా ఉత్పత్తి చేయడం అంత సులువా?
అమెరికాలో సొంతంగా మెడిసిన్ తయారు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అది అంత సులువు కాదు. ఎందుకంటే ఈ మధ్య యాపిల్ కంపెనీ కూడా అమెరికాలో తయారు చేస్తే యాపిల్ ఫోన్ ధర పెరుగుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్ విధిస్తానని బెదిరించినా కూడా ఇండియాలో ఐఫోన్ తయారు చేయడానికే మొగ్గుచూపింది. ఇప్పుడు మెడిసిన్ ముడివస్తువులను దిగుమతి చేసుకుని ఉత్పత్తి చేసి జనాల్లోకి తీసుకురావాలంటే అమెరికాలో చాలా ఖర్చుతో కూడుకున్న పని.
ప్రస్తుతం అమెరికాకు భారత్ నుంచి 25 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వాటిలో కొన్ని రకాల మందుల మీద 25 శాతం వరకు టారిఫ్ ఉంది. కొన్నిటికి డ్యూటీ ఫ్రీ ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ ఫార్మా మీద టారిఫ్ లు విధిస్తే రెండు దేశాలకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.