ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోసం ఎదురుచూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సోమవారం ఓ పోస్టు పెట్టారు. ‘ట్రంప్ రాక కోసం భారత్ ఎదురుచూస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరింత పెంచుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే అహ్మదాబాద్‌లో కలుసుకుందాం’ అని ట్రంప్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ భార్యతో సహా భారత్‌కు బయల్దేరినట్లు ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్న సమయానికి ఇక్కడికి చేరుకుంటారు.
అమెరికాతో కలిసి ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఢిల్లీ నగరం వేదిక అవుతోంది. రెండు రోజుల పర్యటనలో ట్రంప్ ఫ్యామిలీ సహా అమెరికా అధికారుల బృందానికి భారత సంస్కృతి ఔనత్యాన్ని చాటిచెప్పనున్నారు. అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా స్వాగతం పలకనున్నారు. వాషింగ్టన్ నుంచి బయల్దేరిన ట్రంప్ ఫ్యామిలీ సోమవారం నేరుగా అహ్మదాబాద్ చేరుకోనుంది.
అక్కడి నుంచి ఆగ్రా, ఢిల్లీలలో దాదాపు 36 గంటల పాటు ట్రంప్ పర్యటన సాగనుంది. ఇందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్, మోడీకి మధ్య స్నేహాన్ని మరింత పటిష్టం చేయడానికే ఈ పర్యటన సహకరిస్తుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. గొప్ప స్నేహితులను కలిసే తరుణం కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి స్నేహితుడు. భారత్ పర్యటనకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.
మోడీకి వస్తానని మాటిచ్చి చాలా రోజులైపోతోంది. ఎప్పటికప్పుడూ రావాలని అనుకుంటూనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇన్నేళ్లకు భారత్ రావాలనే ఆకాంక్ష నెరవేరింది. వస్తున్నా.. మోడీ మిత్రమా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా? అంటూ కుటుంబసమేతంగా ట్రంప్ భారత్ వస్తున్నాడు.. ఆయన రాక కోసం భారత్ నమస్తే.. ట్రంప్ అంటూ లక్షల కన్నులతో ఎదురుచూస్తోంది.
India awaits your arrival @POTUS @realDonaldTrump!
Your visit is definitely going to further strengthen the friendship between our nations.
See you very soon in Ahmedabad. https://t.co/dNPInPg03i
— Narendra Modi (@narendramodi) February 24, 2020