Florona Disease : ఇజ్రాయెల్ లో బయటపడ్డ కొత్తరకం “ఫ్లోరోనా” వ్యాధి
ఇప్పటికే ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వొణికిస్తున్న మహమ్మారి మరో కొత్త రూపంలో బయటపడింది. ఇజ్రాయిల్లో కొత్తరకం కరోనా వేరియంట్ గుర్తించారు

Florona
Florona Disease : కరోనా మహమ్మారి భయం ప్రపంచాన్ని పూర్తిగా వదలక ముందే.. దానికి ఇతర సాధారణ వ్యాధులు తోడై కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మాయదారి రోగాలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇజ్రాయిల్లో కొత్త రకమైన వ్యాధి గుర్తించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఇటీవల కాన్పుకోసం వచ్చిన ఒక మహిళలో.. కరోనా వైరస్, ఇన్ఫ్లూయెంజా వైరస్లతో కూడిన డబుల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు వైరస్లు కలిసి ఆమెను ఎటాక్ చేస్తున్నాయని వైద్యులు చెప్పినట్టు ఇజ్రాయెల్ లోని “Yediot Ahronot” పత్రిక వెల్లడించింది. ఈ కొత్తరకం వ్యాధికి ‘ఫ్లోరోనా- Florona(Flu-Corona)’ అని పేరుపెట్టారు.
Also Read: Ayodhya Ram Mandir: రామ మందిర నిర్మాణాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు: హోంమంత్రి అమిత్ షా
ఆసుపత్రిలో ఉన్న మిగతా పేషెంట్ లలోనూ ఈ “ఫ్లోరోనా” ఉండి ఉంటుందని అనుమానిస్తున్న వైద్యులు, వారికి ఆరోగ్య పరీక్షలు జరిపి నిర్ధారణ చేయనున్నారు. అయితే ఈ వ్యాధి ప్రభావం మనుషులపై ఎంత మేరకు ఉందనే విషయం ఇంకా తెలియరాలేదని, దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు గజగజలాడుతుంటే.. మరో కొత్త రకం వ్యాధి రావడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే.. కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోనందున ఇజ్రాయెల్ పభుత్వం అక్కడి ప్రజలకు నాలుగో డోసు కరోనా టీకాను పంపిణీ చేస్తోంది.
ఫ్లోరోనా-Florona వ్యాధి అయినప్పటికీ.. మొదట్లో దీనిని కరోనా కొత్త రకం వేరియంట్ అనుకున్నారు. ఐతే.. ఇది వేరియంట్ కాదని ఆ తర్వాత వైద్య నిపుణులు తేల్చారు.
Also Read: Maoist Dump: ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో భారీగా మావోయిస్టు డంపు స్వాధీనం