Mad Drummer : ఇలాంటి డ్రమ్మర్‌ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు..
Mad Drummer : కొంతమందికి తాము చేసే పనిలో లీనమైతే పరసరాల్ని మర్చిపోతారు. అంతగా తమ వృత్తిని ఆరాధిస్తారు. ఓ ప్రదర్శనలో ఓ డ్రమ్మర్ మీదే అందరి దృష్టి పడింది. ఇంతకీ అతను ఏం చేశాడు? చదవండి.

the mad drummer
the mad drummer : కొందరు ఏదైనా పనిలో బాగా లీనమైనప్పుడు పరిసరాల్ని, వ్యక్తుల్ని పట్టించుకోరు. ఓ డ్రమ్మర్ (drummer) కూడా అంతే. తను చేస్తున్న పనిలో ఎంతగా నిమగ్నమయ్యాడంటే ఓ ప్రదర్శనకు సంబంధించిన క్లిప్ చూస్తే అర్ధం అవుతుంది.
ప్రకృతి వింతలు : చెట్లలోంచి వాటర్ ఫాల్..వైరల్ వీడియోలు
ఓ స్టేజ్ మీద 1967 నాటి బ్యాండ్ వాన్ మోరిసన్ (Van Morrison) రచించిన బ్రౌన్ ఐడ్ గర్ల్ (Brown Eyed Girl) సాంగ్ ప్లే చేస్తున్నారు. అదే టైంలో కెమెరాను జూమ్ చేసారు. స్టేజ్ మీద ఓ డ్రమ్మర్ హైపర్ యాక్టివ్ గా కనిపించాడు. రకరకాల హావభావాల్ని ప్రదర్శిస్తూ డ్రమ్ స్టిక్స్ తో డ్రమ్ వాయించడం మొదలుపెట్టాడు. ఒకానొక దశలో అతని ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అతను ప్రదర్శనలో ఎంతగా లీనమయ్యాడో అర్ధం అవుతుంది. ఈ డ్రమ్మర్ ని స్టీవ్ మూర్ గా ( Steve Moore) గుర్తించారు. “ది మ్యాడ్ డ్రమ్మర్” (the mad drummer) పేరుతో అతనికి ఓ బ్యాండ్ కూడా ఉందట. ఇక ఇతనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
కవలల్ని పెళ్లాడిన కవలలు ఒకేసారి గర్భవతులయ్యారు..కవలలే పుట్టాలని కలలు
ఈ బ్యాండ్ ను కలిసానని చాలామంచి మ్యూజిషియన్స్ అని కొందరు.. చూడటానికి ఈ వీడియో చాలా సరదాగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా మూర్ కి పని పట్ల ఉన్న అభిమానాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.
Drummer showed up to the wrong gig lol pic.twitter.com/lMo1SS0Hb1
— Woman of Wonder (@WonderW97800751) April 10, 2023