Drunk Man : మద్యం మత్తులో మహిళ ఇంట్లోకి ప్రవేశించి..

మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. తెలియని వారి ఇంట్లోకి వెళ్లి భోజనం చేయడం, అక్కడే నిద్ర పోవడం..దొంగతనాలు చేయడం కామన్ అయిపోయాయి. అయితే..ఓ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం సేవించి ఓ మహిళ ఇంట్లోకి వెళ్లాడు.

Drunk Man : మద్యం మత్తులో మహిళ ఇంట్లోకి ప్రవేశించి..

Drunk Man

Updated On : July 8, 2021 / 2:48 PM IST

Drunk Man Enters Woman’s Home : మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. తెలియని వారి ఇంట్లోకి వెళ్లి భోజనం చేయడం, అక్కడే నిద్ర పోవడం..దొంగతనాలు చేయడం కామన్ అయిపోయాయి. అయితే..ఓ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం సేవించి ఓ మహిళ ఇంట్లోకి వెళ్లాడు. వారి టాయిలెట్ కి వెళ్లి…అక్కడే ఓ పది నిమిషాలు ఉండిపోయాడు. ఈ ఘటన యూకేలోని వెస్ట్ మిడ్ లాండ్స్ లో చోటు చేసుకుంది.

Read More : Khushbu: కమిట్‌మెంట్ అడిగిన హీరోకు ఖుష్బూ దిమ్మతిరిగే ఆన్సర్!

మిడ్ లాండ్స్ లో Kristy MacDonald నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నారు. అకస్మాత్తుగా ఏదో అలికిడి వినిపించింది. దీంతో ఎవరో ఇంట్లోకి వచ్చారని అర్థమైంది. వెంటనే లేచి అటూఇటూ చూసింది. వారు ఉపయోగించే టాయిలెట్ లో ఉన్నారని గ్రహించారు. ఎవరు మీరు ? ఏం చేస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. కానీ..అప్పటికే అతను మెట్లు దిగి అమాంతం పారిపోయాడని Kristy MacDonald తెలిపారు.

అపరిచితుడు తనింట్లో పది నిమిషాలు సులభంగా గడిపాడని, ఇద్దరు అపరిచితులు వచ్చారని తెలిపారు. తనింట్లో ఉన్న టాయిలెట్ ను ఉపయోగించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఒకరు ఇంట్లో లేని సమయంలో మద్యం మత్తులో ప్రవేశించి..అక్కడనే రాత్రి ఉండిపోయిన ఘటన తెలిసిందే.

Read More : L.Rramana : గులాబీ గూటికి ఎల్.రమణ..? సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న T.టీడీపీ నేత