L.Rramana : గులాబీ గూటికి ఎల్.రమణ..? సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న T.టీడీపీ నేత

తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారని గత కొంతకాలంలో వార్తలువినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఎందుకంటే.. ఎల్. రమణి ఈరోజు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇప్పటికే రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. హుజారాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రమణ సీఎంను కలవటం టీడీపీ నేత గులాబీ గూటికి చేరటం ఖాయం అనిపిస్తోంది.

L.Rramana : గులాబీ గూటికి ఎల్.రమణ..? సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న T.టీడీపీ నేత

L.rramana To Meet Cm Kcr

L.Rramana to meet CM KCR : తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారని గత కొంతకాలంలో వార్తలువినిపిస్తున్నాయి. కానీ దీనిమీద ఇప్పటి వరకూ పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఎల్.రమణను ఎలాగైనా సరే పార్టీలోకి రప్పించుకోవటానికి టీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు పలుసార్లు రమణతో భేటీ అయ్యారు. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు ఒక కొలిక్కి వ‌చ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. పార్టీలోకి చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లుగా సమాచారం.

మరోసారి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎల్.రమణతో సంప్రదింపులుచేయగా అవి ఫలించినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో రమణ మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలంగాణా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రమణ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారక తప్పదనట్లుగా ఉంది పరిస్థితి. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసిన రమణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణాలో టీడీపీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం రమణ టీఆర్ఎస్ లోకి చేరనున్నట్లుగా పక్కా సమాచారం.

బీసీ నేత అయిన మాజీ టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన అనంతరం ఎలాగైనా రమణతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని గులాబీ బాస్ ప్లాన్. అదే సమయంలో ఈటెల రాజేందర్ రాజీనామా తరువాత హుజారాబాద్ కు ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎల్.రమణకు గులాబీ గూటికి చేరునున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఈరోజు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.

ఎల్‌.రమణకు బీసీ నేత‌గా, సౌమ్యుడిగా మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ… రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈక్రమంలో గులాబీ నేతల చర్చలు ఫలించి రమణ గులాబీ గూటికి చేరటం పక్కా అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంశం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.