Trump – Machado : ఎట్టకేలకు ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బహుమతి..! ‘థ్యాంక్ యూ ట్రంప్’ అంటూ నినాదాలు..
Trump – Machado : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో భేటీ అయ్యారు. గురువారం వైట్‌హౌస్‌లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ఆమె ట్రంప్‌నకు అందజేశారు.
Maria Corina Machado Donald Trump
- ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో భేటీ
- వైట్‌హౌస్ వేదికగా గంటకుపైగా సాగిన సమావేశం
- నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు అందజేసిన మచాడో
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. నోబెల్ శాంతి బహుమతి ఆయన చేతికందింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ నోబెల్ శాంతి బహుమతి నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు.. వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో ట్రంప్‌నకు దీన్ని అందజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో భేటీ అయ్యారు. గురువారం వైట్‌హౌస్‌లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ఆమె ట్రంప్‌నకు అందజేశారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తరువాత ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మచాడో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకుపైగా సాగిన సమావేశం తరుమా మచాడో వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మనం అధ్యక్షుడు ట్రంప్ పై ఆధారపడవచ్చు అని ఆమె పేర్కొన్నారు. అనంతరం థ్యాంక్ యూ ట్రంప్ అంటూ తన మద్దతుదారులతో నినాదాలు చేయించారు. అయితే, నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ స్వీకరించారా అని మీడియా ప్రశ్నించగా.. మచాడో సమాధానం ఇవ్వలేదు.
వెనెజువెలా ప్రజల సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా తనకు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఆయనకు అందజేశానని మచాడో తెలిపారు. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ సాధన కోసం ట్రంప్ చేస్తున్న కృషిపై తమకు విశ్వాసం ఉందని తెలిపారు. వెనెజువెలా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.
వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య అనంతరం అక్కడ పరిణామాలు మారిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలోనూ మచాడోకు ట్రంప్ మద్దతు ప్రకటించలేదు. వెనెజువెలాను నడిపేంత శక్తి మచాడోకు లేదని ట్రంప్ వ్యాఖ్యానించాడు. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌కు మద్దతునిచ్చారు. తాజాగా జరిగిన సమావేశంలోనూ డెల్సీతో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది.
