పసిపాప నవ్వు కోసం తండ్రి పాట్లు.. నెటిజన్లు ఫిదా

పసిపిల్లల నవ్వుల్లో మాధుర్యం.. ఆ నవ్వు చూస్తే వచ్చే ఆనందం కోసం ఏమైనా చేసేయొచ్చు. కన్న పిల్లల కోసం తల్లిదండ్రులైతే దేనికి నో చెప్పరు. నింగిలోని చందమామ రాదని తెలిసినా చేతికందినంత దూరంలోనే ఉందని ఆ పసి మొహాల్లో నవ్వు చూసేందుకు తాపత్రయం చూపిస్తారు. ఇక్కడ కూడా ఓ తండ్రి చేసిన స్టంట్ అలానే ఉంది. నెలల పాప రోలర్ ఎక్కే వయస్సు లేదు. అయినా ఆ ఎక్స్‌పీరియన్స్ చూపించాలని అనుకున్నాడు.
దీని కోసం అతను చేసిన పనికి ఆ చిన్నారేమో కానీ, ఇంటర్నెట్ బెస్ట్ డాడ్ అవార్డ్ ఇచ్చేసింది. ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు అమితమైన రెస్పాన్స్ వస్తుంది. అందులో ‘రోల్ కాస్టర్ ఎక్కేంత వయస్సు లేనప్పుడు ఇంతకంటే ఏం చేయగలం’ అని పోస్టు పెట్టాడు. 55 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో చూసి కొందరైతే కన్నీళ్లు కూడా పెట్టేశామంటూ కామెంట్ చేస్తున్నారు.
టీవీ ముందు వాకర్‌లో నిల్చొపెట్టి రోలర్ క్యాస్టర్ లో మూవ్ అయినట్లు అటూఇటూ కదుపుతుంటే ఆ పాప నిజంగా రోలర్ క్యాస్టర్ మీదే ఉన్నట్లు ఫీల్ అయి తెగ నవ్వేసుకుంటుంది. ఆ పసి నవ్వులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంటే 4లక్షల మంది ఈ వీడియోను చూశారు. మరికొందరైతే ఈ వీడియోను చూసి తమ చిన్నారులనుకూడా ఇలా చేసి వీడియోలు పోస్టు చేస్తున్నారు. మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి..
When your not old enough to get on a roller coaster ???? pic.twitter.com/NO4p3Wj7xJ
— NancyGza (@glamourbynancy) January 19, 2020
well my baby hates me ? pic.twitter.com/x07G1Snn9q
— 4.27? (@janyabee_) January 20, 2020