ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం
ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.

ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది.
ఇస్లామాబాద్: ప్రధాన మంత్రి ఆయన ఆఫీస్ లో ఉన్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం సోమవారం (ఏప్రిల్ 8)జరిగింది. పీఎంవో కార్యాలయంలోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్..ఆ భవనంలోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లుగా తెలిసింది. అగ్నిప్రమాదం సమచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ క్రమంలో అగ్రిప్రమాదం క్రమంలో పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను బైటకు తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర