3,500 years honey pot : ఆఫ్రికాలో 3,500 ఏళ్ల నాటి హనీపాట్ ను వెలికితీసిన పరిశోధకులు

3,500 years honey pot : ఆఫ్రికాలో 3,500 ఏళ్ల నాటి హనీపాట్ ను వెలికితీసిన పరిశోధకులు

3500 Years Old Honey Pot

German researchers found 3500 years old honey pot : భూమి పొరల్లో దాగున్న చరిత్ర పుటల్ని వెలికి తీసి ప్రపంచానికి ఆనాటి వైభవాలను..జీవిన శైలులను చూపించే పరిశోధకులు మరో అద్భుతమైన అత్యంత అరుదైన చరిత్రను వెలికి తీశారు. తమ తవ్వకాల్లో ఎన్నో అరుదైన, అద్భుతమైన కళాఖండాలను వెలికి తీసే సైంటిస్టులు మరోసారి తమ పరిశోధనల్లో విజయం సాధించారు. 10 కాదు 20 కాదు 100 కాదు 200లు కాదు ఏకంగా 3వేల 500ల ఏళ్లనాటి కళాఖండాలను వెలికితీశారు. ఆఫ్రికాలో తవ్వకాలు చేపట్టిన జర్మన్ శాస్త్రవేత్తలు 3,500 ఏళ్లనాటు అరుదైన హనీపాట్ ( తేనె సేకరించే పాత్ర)ను వెలికి తీశారు. దానితో పాటు మరో కొన్ని అద్భుతమైన విగ్రహాలను..మరికొన్ని పాత్రలను వెలికితీశారు.

1

యూకేలోని బ్రిస్టల్ వర్సిటీకి (UK Bristol University) చెందిన రసాయాన శాస్త్రవేత్తల సహకారంతో జర్మనీ గోథే వర్సిటీకి చెందిన పురావస్తు పరిశోధకులు నోక్ సంస్కృతికి చెందిన ఈ పాత్రను కనుగొన్నారు. ఆఫ్రికాలో అతిపురాతన హనీ పాట్ (తేనె సేకరించే పాత్ర)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇది 3500 ఏళ్ల క్రితం నాటి హనీపాట్ అని..ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పురాతన హనీ కంటైనర్ అని స్పష్టం చేశారు. యూకేలోని బ్రిస్టల్ వర్సిటీకి చెందిన రసాయాన శాస్త్రవేత్తల సహకారంతో జర్మనీ గోథే వర్సిటీకి చెందిన పురావస్తు పరిశోధకులు నోక్ సంస్కృతికి చెందిన ఈ పాత్రను కనుగొన్నారు. 3500 ఏళ్ల నాటి ఈ కుండలో తేనెటీగల అవశేషాలను గుర్తించారు.

2

దీంతో పురాతనకాలంలో ఆఫ్రికన్లు తేనె సేకరించేవారని తేలింది. నోక్ కల్చర్ ప్రధానంగా క్రీస్తూపూర్వం 1500లో నైజీరియాలో అభివృద్ధి చెందింది. ఆధునిక యుగం ప్రారంభంలో ఈ నాగరికత ఉండేది. విస్తృతమైన టెర్రాకోట శిల్పాలకు ఈ సంస్కృతి ప్రసిద్ధి చెందింది. ఇవి ఆఫ్రికాలోని అతిపురాతన అలంకారిక కళకు చెందినవి.

6

ఆఫ్రికా ప్రారంభ చరిత్రలో ఇది ప్రత్యేకమైందని..ఆనాటి ఆఫ్రికన్లు ప్రతీరోజు తేనే సేవించేవారని తేలింది. ప్రతీరోజు తాము తీసుకునే ఆహారంలో తేనెను వాడేవారని గోథే వర్సిటీ అధ్యాపకులు పీటర్ బ్రూనిక్ తెలిపారు. తేనె ఎంత ప్రాచీనమైనదో..ఎంత ఆరోగ్యకరమైనదో ఆనాటి ఆఫ్రికన్ల తెలుసుకున్నారని..అందుకే తమ రోజువారి ఆహారంలో తేనెను భాగంగా చేసుకన్నారని 3500 ఏళ్ల క్రితమే తేనె వాడేవారని ఎథ్నో గ్రాఫిక్ డేటా ఆధారంగా కనుగొన్నామని తెలిపారు.

4

ప్రీ హిస్టారిక్ పాటరీ(చరిత్ర పూర్వ కుండల) నుంచి బయో మాలుక్యులర్ సమాచారాన్ని అందిస్తుందనే దానికి ఇది గొప్ప ఉదాహరణ అని జూలీ డున్నే బ్రిస్టల్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. నేచర్ కమ్యునికేషన్స్ అనే పత్రికలో ఈ విషయాలను ప్రచురించారు. నోక్ సంసృ్కతిలోని ప్రజలు పెంపుడు జంతువులను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ బృందం అధ్యయనం ప్రారంభించగా పలు విషయాలు వారికి తెలిసాయి. మూడో వంతు పరిశీలనల్లో తేనెటీగకు విలక్షణమైన అధిక మాలిక్యులర్ లిపిడ్లను కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ లిపిడ్లను పునర్నిర్మించడం ఈ అధ్యయనకారుల వల్ల కాలేదు. వారు బీస్ వ్యాక్స్ నుంచి తేనెను వేరు చేయడానికి వాటిని కుండల్లో వేడి చేసేవారని పరిశోధకులు భావిస్తున్నారు.

3

తేనెను ప్రాసెస్ చేసేందుకు జంతువులు, మొక్కల నుంచి సేకరించిన ఇతర ముడి పదార్థాలను వాడేవారనీ..సంప్రదాయ ఆఫ్రికన్ సమాజంలో నేటికి ఈ విధానాన్ని వాడుతున్నారని తెలిపారు. మట్టికుండలను బీహైవ్స్ గా ఉపయోగించేవారని అంచనా వేశారు. ఆఫ్రికాలో తేనె వాడే సంప్రదాయం చాలా కాలంగా ఉందని మేము భావిస్తున్నామని తెలిపారు.