ప్రేమంటే ఇదే : ప్రియురాలి మృతదేహాన్ని పెళ్లాడి..భర్తగా అంత్యక్రియలు చేశాడు

ప్రేమంటే సినిమాలకు..షికార్లు తిరగటం కాదు..ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం కానే కాదు..చావైనా..బ్రతుకైనా కలిసి ఉంటాం..కష్టాలు వచ్చినా నీకోసమే అని బంధాన్ని పెంచుకోవటం..అటువంటి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డాడు ఓ ప్రేమికుడు. చనిపోయిన ప్రియురాలిని పెళ్లి చేసుకుని భర్తగా మారాడు. భర్త స్థానంలో ఉండి ఆమెకు అంత్యక్రియలు చేశాడు.
హృదయాన్ని బరువెక్కించే ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 35 ఏళ్ల జు షినాన్, యంగ్ లియులు 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నారు. కొన్నాళ్లకు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచాడు అన్నట్లుగా ..రొమ్ము క్యాన్సర్ తో బాధపడే లియు అక్టోబరు 14న చనిపోయింది. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆఖరి కోరికను షినాన్ తీర్చాలనుకున్నాడు.
ఈ విషయాన్ని షినాన్ ఇరు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు కూడా ఒప్పుకున్నారు. లియుపై షినాన్ ప్రేమకు వారు ఆశ్చర్యపోయారు. లియు మృతదేహానికి పెళ్లి కూతురుగా దుస్తులు వేసి ముస్తాబు చేశారు. ఆమె శవ పేటికను 169 గులాబీలతో డెకరేట్ చేశారు. బంధుమిత్రుల సమక్షంలో షినాన్ ఆమె చేతికి ఉంగరం తొడిగి పెళ్లి చేసుకున్నాడు షినాన్. ఆమె భర్తగా మారి అంత్యక్రియలు నిర్వర్తించాడు. చైనా సంప్రదాయం ప్రకారం.. షినాన్ ఆమె మృతదేహం వద్ద ఏడు రోజులు నిలబడ్డాడు. శరీరాన్ని వదిలి వెళ్లే ఆత్మను గౌరవించేందుకు చైనీయులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఆ సంప్రదాయాన్ని పాటించాడు షినాన్.
జు షినాన్, యంగ్ లియు ప్రేమ కథ
యంగ్, షినాన్‌లు ఆగస్టు 2007లో ప్రేమలో పడ్డారు. ఆన్‌లైన్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే యూనివర్శిటీలో క్లాస్‌మేట్స్‌గా చదువుకున్నారు. ఆగస్టు 2013లోనే పెళ్లి చేసుకోవడం పేర్లను నమోదు చేసుకుని లివింగ్ రిలేషన్(సహజీవనం) చేశారు. 2019 మార్చిలో లియుకు రొమ్ము క్యాన్సర్‌కు వచ్చినట్లు తెలుసుకుంది. కిమో థెరఫీ కూడా చేయించుకుంది.
లియు మృతి తరువాత షినాన్ మాట్లాడుతూ.. క్యాన్సర్ సోకిందనే చింత ఆమెలో ఏ మాత్రం భయపడేది కాదని..ఆసుపత్రిలో చేరడానికి కొద్ది రోజుల ముందు వెడ్డింగ్ గౌనును ఆర్డర్ కూడా ఇచ్చినట్లు తనకు తెలిసింది. దీంతో ఆమెకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు తెలిసింది. అది నెరవేర్చుదామని అనుకొనేలోపే చనిపోయిందని ఆవేదనతో తెలిపాడు. తాను చనిపోయానా నాలోనే బ్రతికి ఉందని నమ్ముతున్నాను అందుకే ఆమె కోరికను తీర్చాలని అనుకున్నానని చెప్పాడు.