ఇది నిజం : మండుతున్న పట్టాలపై వెళుతున్న రైళ్లు

ఇది నిజం : మండుతున్న పట్టాలపై వెళుతున్న రైళ్లు

Updated On : February 2, 2019 / 8:19 AM IST

రైలు పట్టాలు తగలబెట్టేస్తున్నారు. కిరోసిస్ పోసి మరీ మండిస్తున్నారు. ఇది చేస్తున్నది ఆకతాయిలు, అల్లరిమూకలు కాదు. రైల్వేశాఖ అధికారులే. అవాక్కయ్యారా.. ఇది నిజం. ఎందుకిలా అంటే.. పట్టాలను అలా మండిస్తేనే రైళ్లు వెళతాయి. ఇది కట్టుకథ కాదు జరుగుతున్న వాస్తవం. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో రైలు పట్టాలు సంకోచానికి గురై పగుళ్లు ఏర్పడుతున్నాయి. అందుకే ఇలా మంటబెట్టి వేడెక్కిన తర్వాత వాటిపై నడిపిస్తున్నారు. అమెరికా పశ్చిమ మధ్య ప్రాంతమైన చికాగో ట్రిబ్యూన్‌పై అంటార్కిటికా సముద్రం పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

ఆ పరిసర ప్రాంతాలన్నీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో గడ్డ కట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న రైలు పట్టాలు కూడా సంకోచించుకుపోయి.. రైళ్లు ప్రయాణించేందుకు ప్రతికూలంగా తయారవుతున్నాయి. రైలు పట్టాలు విరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ఒక దాంతో మరొకటి కలిపిన పట్టాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అక్కడి రైల్వే శాఖ కొత్త విధానానికి తెరలేపింది. రైలు పట్టాలను తగలబెట్టేస్తుంది. దాంతో వేడెక్కిన రైలు పట్టాలు ప్రయాణించేందుకు వీలుగా తయారవుతున్నాయి. మరమ్మతులు చేసేందుకు వీలుగా ఉంటున్నాయని తెలిపింది. విరిగిపోయి, వంగిపోయిన పట్టాలను రిపేర్ చేసేందుకు ఇలా మంటబెట్టి వేడెక్కిన తర్వాత మార్పులు చేస్తున్నారు. ఈ దృశ్యాలను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. అంతే వైరల్‌ అయ్యింది. నెటిజన్లంతా కళ్లప్పగించి వీడియోను వీక్షిస్తున్నారు. మండే పట్టాలపై రైలు ఎలా వెళుతుందో మీరూ చూసేయండీ…