Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…

విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు అమెజాన్ అడవిలో సంచరిస్తున్నారని సహాయక బృందానికి ఆనవాళ్లు లభించాయి. విమాన ప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన సహాయక సిబ్బందికి నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో దట్టమైన అమెజాన్ అడవిలో పిల్లల కోసం గాలింపు చేపట్టారు...

Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…

children find wonder

children find wonder in the Amazon forest : విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు అమెజాన్ అడవిలో సంచరిస్తున్నారని సహాయక బృందానికి ఆనవాళ్లు లభించాయి. విమాన ప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన సహాయక సిబ్బందికి నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో దట్టమైన అమెజాన్ అడవిలో పిల్లల కోసం గాలింపు చేపట్టారు, అడవిలో కత్తెర, హెయిర్ టై, పిల్లల మంచినీళ్ల బాటిళ్లు పడి ఉండటాన్ని సహాయక సిబ్బంది గమనించారు. అడవిలో పిల్లల పాదముద్రలను గుర్తించి వారు బతికే ఉంటారని నిర్ధారణకు వచ్చి వారి కోసం గాలించారు.

Missing Children in Amazon forest: విమాన ప్రమాదం తర్వాత అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలు…40 రోజుల తర్వాత ఏమైందంటే..

అటవీ సమీప గ్రామాల ప్రజల సహాయంతో గాలిస్తున్న సిబ్బంది హుయిటోటో భాషలో రికార్డు చేసిన పిల్లల అమ్మమ్మ మెసేజ్ ను హెలికాప్టర్ల సాయంతో ప్రసారం చేశారు. పిల్లలు అడవిలో ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని సిబ్బంది కోరారు. అడవిలో అక్కడక్కడ కొన్ని పండ్లు కొరిక ఉండటంతో పిల్లలు తిని ఉంటారని, వారు బతికే ఉంటారని సహాయ సిబ్బంది భావించి గాలింపు ముమ్మరం చేశారు. ఈ పిల్లలు హయిటోటో గ్రూపునకు చెందిన పిల్లలు కావడంతో వారికి పండ్లపై అవగాహన ఉందని, దీంతో వారు అటవీ ప్రాంతంలో మనుగడ సాధించేందుకు సహకరించాయని సెర్చ్ సిబ్బంది చెప్పారు.

Railway Board orders: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్: రైల్వే సిగ్నల్‌కు ఇక డబుల్ లాక్

అడవిలో గాలిస్తున్న వారికి మొబైల్ ఫోన్ లోని లోహపు ముక్క దొరికింది.కారడవిలో ఎట్టకేలకు నలుగురు పిల్లల జాడ గుర్తించి వారిని సహాయక బృందం కాపాడింది. అమెజాన్ అడవి నుంచి కాపాడిన పిల్లలను కొలంబియా రాజధాని బొగోటాకు తరలించారు. బొగోటా ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స అందిస్తున్నారు.విమాన ప్రమాదం నుంచి బయటపడిన పిల్లలు 40 రోజుల పాటు అడవిలో ఆకులు, అలములు తింటూ ప్రాణాలతో బయటపడటం కొలంబియాలో చర్చనీయాంశంగా మారింది. అమెజాన్ అడవిలో అద్భుతం జరిగిందని కొలంబియా దేశాధ్యక్షుడు వ్యాఖ్యానించారు.