వణికించే పెనుగాలులు, వదలని వానలు.. అమెరికాలో హెలెనా బీభత్సం..

రోజు గడిస్తే చాలు అనుకునే స్థాయిని హరికేన్ క్రియేట్ చేసింది.

వణికించే పెనుగాలులు, వదలని వానలు.. అమెరికాలో హెలెనా బీభత్సం..

Hurricane Helene (Photo Credit : Google)

Updated On : September 30, 2024 / 1:34 AM IST

Hurricane Helene : అమెరికాలో హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఎటు చూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, వరద నీటితో పరిస్థితి భయానకంగా మారింది. నాలుగు రాష్ట్రాల్లో హెలెనా సృష్టించిన విధ్వంసానికి ఇప్పటివరకు 45మంది మరణించారు. పెనుగాలులకు ఫ్లోరిడా వణికిపోతే.. అట్లాంటాను వర్షం ముంచెత్తింది. దీంతో జనం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.

హరికేన్ హెలెనా అమెరికాను వణికిస్తోంది. రోజు గడిస్తే చాలు అనుకునే స్థాయిని హరికేన్ క్రియేట్ చేసింది. కుండపోత వర్షాలకు నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు నీటమునిగాయి. విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగాయి. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో హెలెనా ప్రభావం తీవ్రంగా ఉంది. వర్జీనియా రాష్ట్రంలోనూ హెలెనా బీభత్సం సృష్టిస్తోంది.

Also Read : నేపాల్‌లో వరద బీభత్సం.. 60 మంది మృతి, 44 మంది గల్లంతు..!