భారత్ నుంచి న్యూయార్క్ చేరుకున్న హైడ్రాక్సీక్లోరోక్విన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 05:59 AM IST
భారత్ నుంచి న్యూయార్క్ చేరుకున్న హైడ్రాక్సీక్లోరోక్విన్

Updated On : April 12, 2020 / 5:59 AM IST

అమెరికాకు సాయంగా భారత్ పంపిన యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఆదివారం న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ పై పోరాటంలో తమ భాగస్వాములకు మద్దతుగా నిలుస్తున్నాం అంటూ ఆయన హైడ్రాక్సీక్లోరోక్విన్ సరుకు ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ప్రపంచంలోని హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాలో 70 శాతం (200 మి.గ్రా చొప్పున సుమారు 20 కోట్ల మాత్రలు) భారతదేశం ఒక్కటే తయారు చేస్తుంది. కరోనా వైరస్(COVID-19) కేసులకు సాధ్యమైన చికిత్సగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మెడిసిన్ ను గుర్తించింది. చైనా,దక్షిణ కొరియా ఇలా ప్రపంచంలోని చాలా దేశాలకు కరోనా వైరస్ ట్రీట్మెంట్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగిస్తున్నాయి.భారత్ కూడా కరోనా ట్రీట్మెంట్ లో ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తుంది.

అయితే మార్చి-25న భారత్…ఇతర దేశాలకు ఈ ట్యాబ్లెట్ల సప్లయ్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాల్సిందిగా అమెరికాతో పాటు బ్రెజిల్‌ సహా 30 దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. దీంతో మానవత్వం దృష్ట్యా ఈ ట్యాబ్లెట్లను అవసరమైన దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఇటీవల భారత్ ప్రకటించింది.

హైడ్రాక్సీక్లోరో​క్విన్‌పై భారత నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. భారత్ కు,ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.ఈ మేలు మర్చిపోం అని ట్రంప్ అన్నారు. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను..లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు ఆంజనేయస్వామి తీసుకొచ్చిన సంజీవనితో పోల్చారు బ్రెజిల్ అధ్యక్షుడు. బ్రెజిల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించినందుకు ఆ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.