Shoaib Akhtar: ఇండియాకు ఆక్సిజన్ ఇచ్చి ఆదుకుందాం – షోయబ్ అక్తర్

ఇండియా క‌రోనా సంక్షోభంలో కూరుకుపోయిన స‌మ‌యంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ వీడియో ద్వారా ఇండోపాక్ ..

Shoaib Akhtar: ఇండియాకు ఆక్సిజన్ ఇచ్చి ఆదుకుందాం – షోయబ్ అక్తర్

Shoib Akthar

Updated On : April 25, 2021 / 1:59 PM IST

Shoaib Akhtar: ఇండియా క‌రోనా సంక్షోభంలో కూరుకుపోయిన స‌మ‌యంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ వీడియో ద్వారా ఇండోపాక్ అభిమానుల‌కు స్పెషల్ మెసేజ్ ఇస్తున్నాడు. వైర‌స్‌పై పోరాటంలో భాగంగా పొరుగు దేశం ఇండియాకు స‌హాయం చేద్దామంటూ ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవ‌డం ఏ ప్ర‌భుత్వానికైనా అసాధ్య‌మ‌ని అక్త‌ర్ వివరించాడు.

ఆక్సిజ‌న్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న భార‌తదేశానికి ఆక్సిజ‌న్ ఇద్దామంటూ పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి విన్నవించాడు. ‘ఇండియా నిజంగా చాలా అవస్థలు పడుతుంది. ప్రపంచదేశాల సాయం అవసరముంది. ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మనమంతా కలిసి సాయం చేయాలి. ఒకరికొకరు సపోర్ట్ కచ్చితంగా చేసుకోవాలి’

‘ఇండియాకు సాయం చేయాల్సిందిగా మా ప్ర‌భుత్వం, అభిమానుల‌ను కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజ‌న్ ట్యాంకులు అవసరం ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ ఇండియా కోసం విరాళాలు సేక‌రించి, వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను అందించాల‌ని కోరుతున్నాను’ అని త‌న యూట్యూబ్ చానెల్ వీడియోలో అక్త‌ర్ కోరాడు.

ఇంత‌కుముందు కూడా ఇండియాలో క‌రోనా తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన అక్త‌ర్‌.. సాయం చేయాల్సిందిగా ప్ర‌పంచ దేశాల‌ను కోరాడు. పలు సందర్భాల్లో క్రికెటర్ల ఆటతీరును విశ్లేషిస్తూ యూట్యూబ్ లో విశ్లేషిస్తూ వస్తున్నాడు షోయబ్.