Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను నిద్రపోనివ్వట్లేదు, వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదు.. ఇంకా..: లాయర్లు

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ గురించి ఆయన లాయర్లు పలు విషయాలు తెలిపారు.

Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను నిద్రపోనివ్వట్లేదు, వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదు.. ఇంకా..: లాయర్లు

IMran Khan

Updated On : May 12, 2023 / 10:23 AM IST

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను జైలులోనే చంపేందుకు కుట్ర పన్నారని ఆయన లాయర్లు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ను జైలులో హింసిస్తున్నారని, ఆయన తినే ఆహారంలో ఇన్సులిన్ కలిపి ఇస్తున్నారని, దాంతో ఆయనకు గుండెపోటు తెప్పించాలనుకుంటున్నారని చెప్పారు.

అవినీతికి పాల్పడ్డ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ మెల్లిగా గుండెపోటుకు గురయ్యేలా ఇప్పటికే ఆయనకు ఇంజక్షన్ ఇచ్చారని లాయర్లు తెలిపారు. అంతేగాక, వాష్‌రూమ్‌లను వాడుకునేందుకు ఆయనకు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు.

ఇమ్రాన్ ఛాతీ నొప్పితోనూ బాధపడుతున్నారని చెప్పారు. ఆయన నిద్రపోయే వీలు కూడా లేకుండా చేశారని ఆరోపించారు. టాయిలెట్, బెడ్ లేని మురికి గదిలో ఆయనను ఉంచారని అన్నారు. ఆయనకు సరిగ్గా ఆహారం కూడా అందించడం లేదని చెప్పారు. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయం విదితమే.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అధికారుల కస్టడీలో ఉన్నారు. తనను చంపేయడానికి కుట్ర పన్నారని ఇమ్రాన్ ఖాన్ కూడా పలు సార్లు చెప్పారు.

Singapore : పని మనిషిపై దాడి కేసు.. సింగపూర్ లో భారతీయురాలికి జైలు శిక్ష