Sri Lanka Crisis : శ్రీలంకలో దయనీయ పరిస్థితులు..పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న జనం

తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్లలో ఎదురుచూసి చూసీ జనం ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Sri Lanka Crisis : శ్రీలంకలో దయనీయ పరిస్థితులు..పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న జనం

Srilanka

Updated On : July 23, 2022 / 12:38 PM IST

Sri Lanka Crisis : తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలైన్లలో ఎదురుచూసి చూసీ జనం ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్‌ గుణవర్థనను నియమించిన రోజే మరో ఇద్దరు క్యూలైన్లలో ఉండి కుప్పకూలారు. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో కిన్నియా పట్టణంలో ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద తన మోటార్‌ సైకిల్‌కు ఇంధనం నింపేందుకు 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజులు పడిగాపులు కాశాడు. నిన్న ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

Sri Lanka: సాయాన్ని ఆపొద్దు.. ఇండియాకు శ్రీలంక వినతి

అటు మథుగమ ప్రాంతంలో పెట్రోల్‌ బంకు వద్ద క్యూ లైన్‌లో నిలబడి మరో వృద్ధుడు కుప్పకూలిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇంధనం పొందడానికి జనం క్యూలైన్లలో వేచి చూసి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. 2022 ఆరంభం నుంచే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో నిలబడుతున్న క్రమంలో తీవ్రమైన వేడిని తట్టుకోలేక అలిసిపోయి కొందరు ప్రాణాలు విడిచారు.