India-China Posts: ఇండియా-చైనా బలగాల మధ్య దూరం కేవలం 150 మీటర్లే

ఇండియా.. చైనా మిలటరీ క్యాంపుల మధ్య దూరం కేవలం 150మీటర్లే ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. షెల్టర్ కోసం టెంట్లు వేసుకున్న సైనికుల నివాసాలను మార్క్ చేస్తూ.. ఫొటోలను విడుదల చేసింది.

India-China Posts: ఇండియా-చైనా బలగాల మధ్య దూరం కేవలం 150 మీటర్లే

India China (1)

Updated On : June 29, 2021 / 4:01 PM IST

India-China Posts: ఇండియా.. చైనా బలగాలు సరిహద్దుల్లో భారీగా మోహరించాయి. చైనా సైన్యంతో పాటు ఆయుధాలను బీజింగ్ నుంచి తరలించిందనే సమాచారం రావడంతో శనివారం ఇండియా నుంచి 50వేల మంది అదనపు బలగాలు బోర్డర్ కు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈస్టరన్ లడఖ్ లోని సౌత్ పాంగాంగ్ లో ఇరు దేశాల మిలటరీ క్యాంపుల ఫొటోలు గూగుల్ ఎర్త్ ప్రో విడుదల చేసింది.

ఫిబ్రవరిలో ఇరు దేశాల మిలటరీ క్యాంపుల మధ్య దూరం కేవలం 150మీటర్లే ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. షెల్టర్ కోసం టెంట్లు వేసుకున్న సైనికుల నివాసాలను మార్క్ చేస్తూ.. ఫొటోలను విడుదల చేసింది. 17వేల అడుగుల ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాటి మధ్య దూరం అక్షరాల 493 అడుగులు మాత్రమే అని ఇమేజ్ లో కనిపిస్తుంది.

Dfgdfg

Dfgdfg

కైలాష్ రేంజ్ వ్యాప్తంగా ఉన్న ఇరు క్యాంపుల ట్యాంకుల మధ్య దూరం కేవలం 50మీటర్లే అని గూగుల్ ఎర్త్ ఇమేజరీ చెబుతుంది. అయితే ఈ ఫొటోలు మాత్రం జనవరి 10న విత్ డ్రా అవడానికి ముందు రోజువి.

గతేడాది ఆగష్టులో చైనా బలగాలు వారి క్యాంపులను ఖాళీ చేయడానికి నిరాకరించడంతో.. ఇండియన్ ఆర్మీ సైతం కైలాశ్ రేంజ్ ఎత్తైన పర్వతాలపై ఆక్రమణలు జరిపాయి. ఇరు వైపులా ఆర్మీ బలగాలు కనుచూపు దూరంలోనే మొహరించి ఉన్నాయి.