చైనా కుట్రలకు చెక్.. డెప్సాంగ్‌కు భారీగా ఆయుధాలు, బలగాలను తరలించిన భారత్.. తోకముడిచిన డ్రాగన్

చైనా అసలు స్కెచ్ ఏంటి? పాంగాంగ్‌లో భారత్‌ను పదేపదే ఎందుకు కవ్విస్తోంది. ఉపఖండంలో తిరుగులేని సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న డ్రాగన్ ప్లాన్‌కు భారత్ ఎలా చెక్‌పెట్టగలుగుతుంది? పాంగాంగ్ సో దగ్గరికి సైన్యాన్ని పంపుతూ భారత్‌ను రెచ్చగొడుతోంది చైనా. అయితే డ్రాగన్ అసలు టార్గెట్ పాంగాంగ్ కాదని తెలుస్తుంది. డెప్సాంగ్ మైదానంలో ఆధిపత్యం సాధించి.. ఉపఖండంలో తిరుగులేని సైనిక శక్తిగా ఎదగాలని చైనా కుట్ర పన్నింది.
ఇప్పటికే అక్కడికి 12వేల ట్రూపులను పంపినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. డెప్సాంగ్ పెట్రోలింగ్ పాయింట్ల దగ్గర ఉన్న నంబర్ 10, 11, 12, 13 పెట్రోలింగ్ పాయింట్ల దగ్గర మన గస్తీని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో భారత్ కూడా సరిహద్దుకు భారీగా బలగాలను తరలించింది. తోకజాడిస్తే తాటతీస్తామని హెచ్చరించింది.
డెప్సాంగ్‌లో 11 నుంచి 13 వరకు ఉన్న పాయింట్ల ద్వారా మన దౌల్తీ బేగ్ ఓల్డీ విమానాశ్రయానికి దారి ఉంది. ఇక్కడ నుంచి త్వరగా మన సైన్యాలు దౌల్తీ బేగ్ ఓల్డీ ఎయిర్‌బేస్‌కి చేరుకోగలవ్. అటు చైనా షిన్‌జియాంగ్ పట్టణం నుంచి టిబెట్‌కి చేరుకోవాలంటే ఈ దారి చాలా దగ్గర. అంతర్జాతీయంగా వాణిజ్యంలో నంబర్ వన్ అయ్యేందుకు కూడా డెప్సాంగ్ ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది.
డెప్సాంగ్‌లో చైనా కుట్రను ఉద్దేశించే.. చైనా చెప్పేదొకటి.. చేసేదొకటంటూ రక్షణమంత్రి పార్లమెంట్‌లో విమర్శించారు. ఓవైపు కమాండర్ స్థాయి చర్చలు జరుపుతూనే మరోవైపు వీలైనంత సరిహద్దును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
చైనా పన్నాగం పసిగట్టక ముందు డెప్సాంగ్‌లో భారత సైన్యం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 3వేల కిలోమీటర్ల పైబడి ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంతటా కూడా భారత్ గస్తీ పెంచింది. డెప్సాంగ్‌లోనూ భారత్ పెట్రోలింగ్ చేస్తోంది. అటు అన్ని ఆయుధాలను సిద్ధం చేసింది. లేహ్ యుద్ధ విమానాలతో గస్తీ కాస్తూ డ్రాగన్ గుండెల్లో భారత్ దడ పుట్టిస్తుంది.