Indians at China Border: చైనా సరిహద్దుకు 50వేల మంది సైనికులను పంపిన ఇండియా!
ఇండియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూలేని విధంగా 50వేల అదనపు బలగాలను చైనా బోర్డర్ కు తరలించింది. 1962లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తర్వాత భారత్ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద ఉండిపోయింది.

China Borders
Indians at China Border: ఇండియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూలేని విధంగా 50వేల అదనపు బలగాలను చైనా బోర్డర్ కు తరలించింది. 1962లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తర్వాత భారత్ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద ఉండిపోయింది. కశ్మీర్ గురించి మూడు సార్లు యుద్ధం జరిపి ఇప్పటికీ సుదీర్ఘ కాలంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది.
దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న ఇండియా-చైనా విబేధాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నారు. ఇస్లామాబాద్ కు కాస్త గ్యాప్ ఇచ్చి ముందు బీజింగ్ సంగతి తేల్చాలని చూస్తున్నారు.
గత కొద్ది నెలలుగా.. చైనా బోర్డర్ పలు ప్రాంతాలకు ఇండియా బలగాలను తరలిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఇండియా నుంచి 2లక్షల బలగాలు చైనా సరిహద్దును ఫోకస్ చేసి ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. అంటే గతేడాది కంటే 40శాతం ఎక్కువ.
దీనిపై స్పందించాలని న్యూఢిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి కార్యాలయం అధికార ప్రతినిధిని అడగినప్పటికీ రెస్పాన్స్ రాలేదు.
ముందుగా ఇండియన్ ఆర్మీ.. చైనా బలగాల కదలికలను అడ్డుకునేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇండియన్ కమాండర్లకు అవసరమైతే చైనాలోని ప్రాంతంపై దాడి చేసి సీజ్ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీని కోసం సైనికులను మోసుకుపోయేందుకు చాలా హెలికాఫ్టర్లు అవసరమవుతాయి.
ఇదిలా ఉంటే చైనా సరిహద్దుల్లో ఎన్ని బలగాలు ఉన్నాయనేది స్పష్టం లేదు. రీసెంట్ గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అదనపు బలగాలను టిబెట్ నుంచి చేర్చిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. హిమాలయాల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో పాట్రోలింగ్ నిర్వహించే బలగాలను సమీకరించారు.
వీటితో పాటుగా ఫ్రెష్ గా రన్ వే బిల్డింగులను, బాంబ్ ప్రూఫ్ బంకర్లను ఫైటర్ జెట్స్ నిలిపి ఉంచడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. టిబెట్ సరిహద్దు మేర కొత్త ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉంచారు. బీజింగ్ నుంచి పొడవాటి ఫిరంగులు, ట్యాంకులు, రాకెట్ రెజిమెంట్స్, ట్విన్ ఇంజిన్ ఫైటర్లు కొద్ది నెలలుగా ఇక్కడకు చేర్చుతున్నారు.
అసలు భయమేంటంటే తప్పుడు అంచనాలే ప్రాణ నష్టానికి దారి తీయొచ్చు. చైనాతో ఇండియా పలు చర్చలు జరిపినా ఎక్కువ ప్రభావం కనిపించలేదు. భారీ సంఖ్యలో సైన్యాన్ని ఒక చోటకు చేర్చాక బోర్డర్ లో ఒకవేళ ప్రొటోకాల్స్ పాటించకుండా పోతే పెను నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఓ చిన్న సున్నితమైన అంశమైనా పరిస్థితుల్ని మార్చేయగలదు.
లడఖ్ లోని నార్తరన్ ప్రాంతంలో ఇండియా.. చైనాలు పలు మార్లు ఢీ అన్నాయి. అక్కడే ట్రూపులు కూడా భారీగా పెంచుతూనే ఉన్నారు. దాదాపు 20వేల మంది సైనికులు కనిపిస్తుండగా వారంతా పాకిస్తాన్ పై ఒకప్పుడు యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ లో పాల్గొన్నవారిలానే కనిపిస్తున్నారు.