ప్రశాంత్ ను వీలైనంత త్వరగా దేశానికి తిరిగి రప్పిస్తాం

పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 02:34 PM IST
ప్రశాంత్ ను వీలైనంత త్వరగా దేశానికి తిరిగి రప్పిస్తాం

Updated On : November 21, 2019 / 2:34 PM IST

పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.

పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. 2016-17 నుంచి ప్రశాంత్ ఆచూకీ తెలియడం లేదన్నారు విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్. ప్రశాంత్ ఆచూకీ కోసం 2019 మేలోనే పాకిస్తాన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ సరిహద్దు దాటి పాక్ భూ భాగంలోకి ప్రవేశిస్తే వెంటనే వారికి కన్సులర్ ఆక్సస్ అందించాలని కోరినట్లు రవీష్ చెప్పారు.

ప్రశాంత్ పొరపాటునే సరిహద్దులు దాటాడని భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై మే, 2019లోనే పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చామని తెలిపారు. ప్రశాంత్ ను అరెస్టు చేశామంటూ పాకిస్తాన్ ప్రకటించడంతో అవాక్కయామన్నారు. ఇద్దరు భారతీయులు పాకిస్తాన్ లో పట్టుబడ్డారన్న వార్త మీడియాలో రాగానే పాకిస్తాన్ విదేశాంగ శాఖను సంప్రదించామన్నారు. 

ప్రశాంత్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే పాక్ ప్రభుత్వాన్ని సంప్రదించామని తెలిపారు. వెంటనే ప్రశాంత్ ను కాన్సులర్ యాక్సెస్ అందించాలని కోరామని తెలిపారు. వీలైనంత త్వరగా అప్పగించాలని కోరామని తెలిపారు. ప్రశాంత్ భారత్ కు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రశాంత్ ను వీలైనంత తర్వగా దేశానికి తిరిగి రప్పిస్తామని తెలిపారు.