ఎదురుకట్నం ఇచ్చి : ఇద్దరి గర్ల్ ఫ్రెండ్స్‌తో ఒకేసారి పెళ్లి!
తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరి అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.

తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరి అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.
ప్రపంచంలో ఎన్నో రకాల రిలేషన్‌షిప్ చూస్తున్నాం. ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటుంటారు. ఇది కామన్. మరి కొంతమంది ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సహజీవనం చేస్తుంటారు. ఇద్దరితో కలిసి జీవనం సాగిస్తుంటారు. కానీ, ఇండొనేషియాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఒక అడుగు ముందుకు వేశాడు. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించాడు. తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఆ ఇద్దరి అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకుంటే మరొకరు బాధపడటం ఇష్టం లేక ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నాడు. పైగా.. అమ్మాయిలు ఇద్దరిని పెళ్లి చేసుకునేందుకు భారీగా ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా సమర్పించుకున్నాడట. ఆగస్టు 17న కలిమంటన్, ఎయిర్టాప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వైస్ మీడియా కథనం ప్రకారం.. పెళ్లి కూతుళ్ల కుటుంబాలకు భారీగా ఎదురు కట్నం కూడా ఇతగాడు ఇచ్చాడట. ఇండోనేషియాలో పెళ్లికూతురు కుటుంబానికి కట్నం ఇవ్వడం చాలా కామన్.
అప్పుడే తమ బిడ్డను అతడు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్ముతారట. నిజానికి ఇండోనేషియాలో పెళ్లి మీద పెళ్లిళ్లు (బహుభార్యాత్వం) చేసుకోవడం కొత్త విషయమేమీ కాదు. అక్కడి కొత్త చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చు. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇండోనేషియా వ్యక్తికి చెరో వైపు ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు.