Donald Trump : ట్రంప్‌‌ను పోలిన మరో వ్యక్తి, వీడియో వైరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పోలిన మరో వ్యక్తి ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాడు. పాకిస్తాన్‌లో కుల్ఫీలు అమ్ముతున్నాడు ఇతను. సేమ్...ఇతను డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండడం గమనార్హం. అతని స్వరం కూడా ట్రంప్‌ మాదిరే ఉంది. పాటలు కూడా పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఇతను.

Donald Trump : ట్రంప్‌‌ను పోలిన మరో వ్యక్తి, వీడియో వైరల్

Pak Trump

Updated On : June 17, 2021 / 4:07 PM IST

Donald Trump Pakistan: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పోలిన మరో వ్యక్తి ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాడు. పాకిస్తాన్‌లో కుల్ఫీలు అమ్ముతున్నాడు ఇతను. సేమ్…ఇతను డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండడం గమనార్హం. అతని స్వరం కూడా ట్రంప్‌ మాదిరే ఉంది. పాటలు కూడా పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు ఇతను.

ఆయనను పాక్‌లోని సాహీవాలీ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అతడు కుల్ఫీలు అమ్ముతూ జీవిస్తాడని నిర్ధారించారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని పాకిస్తానీ సింగర్, గేయ రచయిత షెహజాద్ రాయ్ అతని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వా… కుల్ఫీ వాలా భాయ్… అద్భుతం.. అనే క్యాఫ్షన్‌తో వీడియోని షేర్‌ చేశారు. అంతేకాదు, ఎవరికైనా అతని గురించి తెలిస్తే తనకు చెప్పాలని కోరారు.

ఈ వీడియోపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అతను మాకు తెలుసని… అతని వద్ద చాలాసార్లు కుల్ఫీ తిన్నామని కొంతమంది చెబుతుంటే… బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక… ట్రంప్ ఇలా పాకిస్తాన్ వీధుల్లో కుల్ఫీ అమ్ముకుంటున్నాడేమో.. అంటూ మరికొందరు సెటైర్లేస్తున్నారు. ఈ వీడియోలోని వ్యక్తి తమ ప్రాంతానికి చెందినవారని… ఆయన చిరునామా తాము చెబుతామంటూ మరికొందరు సింగర్ షెహజాద్ రాయ్ ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చారు. మరికొందరేమో..వావ్.. సేమ్ టు సేమ్ ట్రంప్ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.