మొసాదా, మజాకా..! ఇరాన్ మద్దతుదారులు ఒక్కొక్కరిగా మటాష్..!

శత్రువు తన వేళ్లతో తన కంటినే పొడుచుకునేలా చేయడం మొసాద్ కు కొత్తేమీ కాదు.

మొసాదా, మజాకా..! ఇరాన్ మద్దతుదారులు ఒక్కొక్కరిగా మటాష్..!

Updated On : October 12, 2024 / 12:52 AM IST

Mossad : ఇరాన్ మీదకు వెళ్లడానికి ముందు ఆ దేశ మద్దతుదారులను కొట్టాలని ఇజ్రాయెల్ ఫిక్స్ అయ్యిందా? అంటే.. అవును అనే అనిపిస్తోంది. అక్టోబర్ 7 ఘటనకు ప్రతీకారంగా హమాస్, హిజ్బొల్లాను క్లియర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందా? దీని కోసం మొసాద్ రంగంలోకి దిగిందా? మొసాద్ ఆపరేషన్స్ తో ఇరాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయా?

ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బొల్లాను క్లియర్ చేయడమే లక్ష్యంగా మొసాద్ తో కలిసి ప్లాన్ చేస్తోంది ఇజ్రాయెల్. తమ వాళ్ల వైపు చూడొద్దని అన్నందుకే ఇరాన్ అలా చేస్తోందో లేదో కానీ.. ఇరాన్ కు చుక్కలు చూపించే పనిలో పడింది మొసాద్. ఇప్పటికే హమాస్ ను దాదాపుగా క్లియర్ చేసేసింది. హిజ్బొల్లా విషయంలోనూ అదే దూకుడు చూపిస్తోంది. కీలక నేత అనే వాడు ఏ కలుగులో దాక్కున్నా.. వెళ్లి మరీ లేపేస్తోంది. హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను లేపేసిన తర్వాత అతడి స్థానంలో సఫీయుద్దీన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది.

దాదాపు నిర్ణయం అయిపోయింది కూడా. ఇప్పుడా సఫీయుద్దీన్ ను కూడా ఖతమ్ చేసింది ఇజ్రాయెల్. నస్రల్లా రీప్లేస్ మెంట్ ను లేపేశామని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ రీప్లేస్ మెంట్ కు రీప్లేస్ మెంట్ ను కూడా లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

శత్రువు తన వేళ్లతో తన కంటినే పొడుచుకునేలా చేయడం మొసాద్ కు కొత్తేమీ కాదు. అప్పుడు నస్రల్లా విషయంలో ఇప్పుడు సఫీయుద్దీన్ విషయంలో సేమ్ టు సేమ్ ఫార్ములా ఫాలో అయ్యింది మొసాద్. ఇరాన్ కీలక అధికారులను, సీక్రెట్ ఏజెంట్లను ట్రాప్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుని ఇరాన్ కు చుక్కులు చూపిస్తూ ఇజ్రాయెల్ కు రూట్ క్లియర్ చేస్తోంది. ఆల్ మోస్ట్ క్లియర్ చేసేసింది కూడా. మరి ఇప్పుడేం జరగబోతోంది? ఇజ్రాయెల్ నెక్ట్స్ఏం చేయబోతోంది?

నస్రల్లా, సఫీయుద్దీన్..ఈ ఇద్దరినీ ఇజ్రాయెల్ ఖతం చేయడం వెనుక మొసాద్ కీలక పాత్ర పోషించింది. వీళ్ల సమాచారం రాబట్టేందుకు ఇరాన్ సైన్యంలో కీలకంగా ఉన్న అధికారినే ట్రాప్ చేసింది. బీరుట్ లో సఫీయుద్దీన్ పై దాడిలో ఇరానియన్ బ్రిగేడియర్ ఇస్మాయిల్ ఖానీ చనిపోయాడనే ప్రచారం జరిగింది. అయితే, అతడు చనిపోలేదని, ఇరాన్ సైన్యం అదుపులో ఉన్నాడని మొసాద్ కు సీక్రెట్ ఏజెంట్ గా ఖానీ పని చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క ప్రకటన మొసాద్ స్టైల్ ఆఫ్ వర్క్ కు అద్దం పడుతుంది.

Also Read : అణు యుద్ధం తప్పదా? ఇజ్రాయెల్ దూకుడుతో టెన్షన్ పడుతున్న అమెరికా..!