Afghanistan : అప్ఘానిస్తాన్ కి మకాం మార్చుతున్న ఐసిస్, జైషే, లష్కరే తోయిబా!
అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రసంస్థలన్నీ ఇప్పుడు

Terrorists
Afghanistan అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రసంస్థలన్నీ ఇప్పుడు తమ సురక్షిత ప్రాంతంగా అప్ఘాన్ ఉంటుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్రసంస్థలన్నీ తమ మాకాంని అప్ఘానిస్తాన్ కి మార్చుతున్నట్లు సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా.. ఉగ్రసంస్థలు-ఐసిస్,జైషే మొహమ్మద్,లష్కర్ ఏ తోయిబా కి చెందిన ఫైటర్లు పెద్ద సంఖ్యలో అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విదేశీ ఉగ్రవాదులు తమ దేశంలోకి వస్తున్నారని తాలిబన్లకు సమాచారమున్నప్పటికీ వారిని దేశంలోకి రాకుండా ఆపేందుకు తాలిబన్లు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సమాచారం.
అయితే తాలిబన్లు-అమెరికా ఒప్పందం ప్రకారం…అఫ్ఘానిస్తాన్ భూభాగంపై నుంచి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించకుండా తాలిబన్లు అడ్డుకోవాలి. అయితే ఇప్పుడు పెద్ద సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు కాబూల్ లోకి చొరబడిన నేపథ్యంలో వారిని తమ దేశం నుంచి తరిమేసి అమెరికాకు ఇచ్చిన హామీని తాలిబన్లు నిలబెట్టకుంటారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
ఖతార్ రాజధాని దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయంతో సన్నిహితంగా పనిచేసే ఒక ఆఫ్ఘన్ మానవ హక్కుల కార్యకర్త ఈ విషయమై మాట్లాడుతూ.. తాలిబాన్ నాయకత్వ ఆదేశాలను ఉల్లంఘించి విదేశీ ఉగ్ర గ్రూపులు తమంతట తాముగా కార్యకలాపాలలో పాల్గొనవచ్చని కాబట్టి రాబోయే కొద్ది రోజులు చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పారు.
అయితే విదేశీ ఉగ్రవాదులు కాబూల్‌లో తమ స్థావరాలను ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకోవడంలో భాగంగా తాలిబాన్ నాయకులు తమను తాము సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మరియు ఆ దిశలో కొన్ని పరిణామాలు సోమవారం తాలిబాన్ వ్యవస్థాపకుడు దివంగత ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకుబ్ రాకతో జరిగాయని తాలిబన్ అగ్ర నేతలు చెబుతున్నారు. దశాబ్దాలుగా తాలిబన్లు తమ స్థావరంగా మార్చుకున్న పాకిస్తాన్ లో క్వెట్టా నగరం నుంచి యాకూబ్ సోమవారం కాబూల్ కి తిరిగొచ్చాడని తాలిబన్ నేతలు తెలిపారు. ప్రస్తుతం తాలిబాన్ దళాల ‘చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్’ గా ఉన్న యాకూబ్.. త్వరలో కాబూల్ కేంద్రంగా అప్ఘానిస్తాన్ లో తాలిబాన్ పాలనను స్థాపించడం ప్రారంభిస్తాడని భావిస్తున్నారు.
READ Mullah Baradar : అప్ఘాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్ ఎవరో తెలుసా!
READ Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!