Israel – Gaza Attacks : దాడులతో దద్దరిల్లుతోన్న ఇజ్రాయెల్, గాజా.. 400కి పైగా పౌరులు మృతి.. ఇజ్రాయెల్ కు భారత్, అమెరికా మద్దతు
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చుకొచ్చినట్లు సమాచారం.

Israel and Gaza Attacks
Israel – Gaza Attacks : దాడులు, ప్రతి దాడులతో ఇజ్రాయెల్, గాజా ప్రాంతాలు దద్దరిల్లాయి. వైమానిక దాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. 400 మందికిపై మృతి చెందారు. తొలుత ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించగా, వైమానిక దాడులతో ఇజ్రాయెల్ ధీటుగా స్పందించింది.
దీంతో ఇరువైపుల భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. హమాస్ దాడుల్లో రెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా, గాజా స్ట్రిప్ లో మృతుల సంఖ్య 230 దాటింది. మొత్తంగా 400కి పైగా మృతి చెందారు. మరో 2 వేలకు పైగా స్థానికులు గాయ పడ్డారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్ లోకి చొరబడి దాడులు జరిపారు.
Israel : హమాస్ దాడి ఎఫెక్ట్..ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాల రద్దు
ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చుకొచ్చినట్లు సమాచారం. తమ పౌరులు, సైనికులను హమాస్ మిలిటెంట్లు నిర్బంధించారని ఇజ్రాయెల్ ధృవీకరించింది. దీంతో హమాస్ దాడులను తిప్పి కొట్టింది. గాజాలోని మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. తమ దేశం యుద్ధంలో ఉందని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
హమాస్ కు ఇరాన్ మద్దతు ఉంది. తాజాగా దాడులను కూడా ఇరాన్ సమర్థించింది. మరోవైపు ఇన్నాళ్లూ పాలస్తీనాకు అండగా ఉన్న సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో విబేధాలను ముగించుకునేందుకు ఒప్పందం దిశగా చేరువైంది. ఈ సమయంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు భగ్గుమనడంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఒప్పందంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటం బలంగా ఉంది.
Indian Students : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ రాజధానికి విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాలు రద్దు చేశామని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
కెనడా ప్రధాని సూడో బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ లోని కెనడా దౌత్య వేత్తల తాజా పరిస్థితులను రిషీ సునక్ కు సూడో వివరించారని, ఈ క్రమంలో దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వ భౌమాధికారం, చట్ట పాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఇరు దేశాల మధ్య, పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలపై సంప్రదింపులు కొనసాగించేందుకు రెండు దేశాల నేతలు అంగీకరించినట్లు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కు భారత్, అమెరికా మద్దతు తెలిపాయి. అండగా ఉంటామని అగ్ర దేశాధినేతలు ప్రకటించారు.