Israel : మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదంట…వైరస్ ను ఎదుర్కొన్నారంట

కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Israel : మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదంట…వైరస్ ను ఎదుర్కొన్నారంట

Israel

Updated On : April 23, 2021 / 10:45 AM IST

Israel Fully Vaccinates Majority Wear Masks Outdoors: కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఓ కారణం ఉంది. దేశ జనాభాలో సగానికి పైగా..కరోనా వ్యాక్సినేషన్ అందించారంట. దీంతో అందరూ బహిరంగప్రదేశాల్లో తప్పనిసరిగా..మాస్కులు ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేసింది.

మాస్క్ లు లేకుండా బహిరంగంగా జల్సాలు చేయవచ్చని..ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రజలకు టీకాలు అందించి కరోనా వైరస్ ను ఎదుర్కొవడంలో విజయం సాధించామని చెబుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..ఇజ్రాయిల్ ప్రభుత్వం ముందుచూపుగా వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది. ఫైజర్, బయోఎన్ టెక్ టీకాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో 60 శాతం మంది ఒక్కడోసు టీకా తీసుకున్నారని వెల్లడవుతోంది. 56 శాతం మంది ప్రజలు రెండో డోస్ తీసుకున్నారంట. 93 లక్షల మంది జనాభాలో 53 శాతం ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేసినట్లు తెలుస్తోంది. ఇన్ డోర్ ప్రాంతాల్లో మాత్రం మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు.

Read More : Odisha : తల పంది ఆకారంలో…చర్మంపై పొలుసులు వింత శిశువు జననం