World Biggest Strawberry : పావుకిలోకంటే పెద్ద స్ట్రాబెర్రీ గిన్నిస్ వరల్డ్ రికార్డు..
289 గ్రాములున్న స్ట్రా బెర్రీ. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.

World Biggest Strawberry
Guinness record as world’s largest : స్ట్రాబెర్రీ.చూడగానే ముద్దొచ్చే ఎర్రని పండు. ఎరుపు రంగులో పండు మధ్యలో చిన్న చిన్న గుంటుగా ఉండే హార్ట్ షేప్ లో ఉండే ఈ పండ్లంటే ఇష్టపడనివారుండరు.పుల్ల పుల్లగా తియ్య తియ్యగా తినేకొద్దీ తినాలనిపిస్తాయి స్ట్రా బెర్రీలు. చూడగానే చటుక్కున తీసుకుని లటక్కున నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది. అందంలోను..రుచిలోను..చక్కటి పోషకాలు కలిగిన స్ట్రాబెర్రీలు ధర కాస్త ఎక్కవే అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి స్ట్రా బెర్రీ ఏకంగా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది.
సాధారణంగా స్ట్రా బెర్రీలు చిన్న చిన్నగా కేవలం ఓ 50 గ్రాముల కంటే తక్కువే బరువుంటాయి.కానీ ఓ ఓ స్ట్రా బెర్రీ మాత్రం ఏకంగా పావు కిలో కంటే ఎక్కువే బరువుంది. ఇజ్రాయొల్ కు చెందిన ఓవ్యక్తి తన స్ట్రా బెర్రీలతో తోటలో పండిందీ 289 గ్రాములున్న స్ట్రా బెర్రీ. ఈ స్ట్రా బెర్రీ తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
Alsor read : World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..
ఇజ్రాయెల్‌కు చెందిన ఏరియల్ చాహీ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీని పండించాడు. దీంతో ఆ స్ట్రాబెర్రీ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. పావుకిలో కంటే ఎక్కువ ఉండటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది.
Alsor read : World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..
ఈ బిగ్ బెర్రీ..4 సెంటీమీటర్ల మందంతో 18 సెంటీమీటర్ల పొడవుతో 34 సెంటీమీటర్ల చుట్టుకొలతతో 289 గ్రాములు ఉన్న ఈ స్ట్రాబెర్రీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు. ఇజ్రాయిల్‌లోని కదిమా జోరాన్ రీజియన్‌లో ఉన్న తన తోటలోనే ఏరియల్ చాహీ అనే రైతు ఈ బిగ్ స్ట్రా బెర్రీని పండించాడు.
Guinness World Record: ఆమెతో పెట్టుకోవద్దు..మజిల్స్ తో పిప్పి చేసిపారేస్తది..