ఇటలీలో కరోనా స్ట్రెయిన్ బాధితుడు, ఆందోళనల్లో ప్రజలు

ఇటలీలో కరోనా స్ట్రెయిన్ బాధితుడు, ఆందోళనల్లో ప్రజలు

Updated On : December 21, 2020 / 11:03 AM IST

Italy has patient with new strain of virus : ప్రపంచ దేశాలను కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ (new strain) కలవర పెడుతోంది. రూపాంతరం చెందిన వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటలీ (Italy)లో బ్రిటన్ (Britain) తరహా..కరోనా స్ట్రెయిన్ బాధితుడిని గుర్తించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై పలు దేశాల నిషేధాజ్ఞలు విధించారు.

బ్రిటన్, దక్షిణాఫ్రికా విమానాలను ఇప్పటికే నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు బ్యాన్ చేశాయి. క్రిస్మస్ వేడుకలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా..ఐరోపా దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. బ్రిటన్‌తో ఉన్న రైలు మార్గాన్ని నిలిపివేస్తున్నట్లు బెల్జియం ప్రకటించింది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ విమానాలను బ్యాన్ చేసింది. కరోనా స్ట్రెయిన్ సంక్షోభంపై 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం బ్రిటన్ ప్రభుత్వం సమావేశం కానుంది.

మరోవైపు…కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ మానిటరింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీలో బ్రిటన్‌ సహా దక్షిణాఫ్రికా దేశాలను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌..జన్యు పరివర్తన క్రమం పరిణామాలపై చర్చించనున్నారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను బ్యాన్ చేయాలని జర్మనీ దేశం యోచిస్తోంది. రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు రెడీ అవుతోంది.

యూకే (United Kingdom)లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోందంటూ.. అక్కడి ప్రభుత్వం లండన్‌లో లాక్‌డౌన్‌ విధించింది. కొత్త వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ (Boris johnson)‌ చెప్పారు. కొత్త రకం స్ట్రెయిన్‌పై నియంత్రణ కోల్పోయామన్న ఆయన..దక్షిణ ఇంగ్లాండ్‌లో క్రిస్‌మస్‌ వేడుకల(Christmas Celebration)పై నిషేధం విధించామన్నారు.