వృద్ధులకు కరోనా ట్రీట్‌మెంట్ చెయ్యరట

వృద్ధులకు కరోనా ట్రీట్‌మెంట్ చెయ్యరట

Updated On : March 17, 2020 / 10:16 AM IST

80ఏళ్లకు పైబడిన వారికి కరోనా ట్రీట్‌మెంట్ ఇవ్వదలచుకోవడం లేదు ఇటాలియన్ గవర్నమెంట్. వరుసగా కరోనా బాధితులు పెరిగిపోతుండటంతో ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు వైద్య సదుపాయాలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇటలీలోని ఐసీయూ వార్డుల్లో ఖాళీ ఉండటం లేదు. ఈ మేరకు వైద్యులు రోగులందరినీ కాకుండా ఎవరైతే కోలుకుంటారనే నమ్మకముందో వారికే వైద్య సహాయం అందిస్తున్నారట. 

ఇందులో భాగంగానే 80సంవత్సరాలకు మించిన వారికి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేమని అధికారులు అంటున్నారు. పీడ్మొంట్‌లో ఉండే లుయిగీ ఇకార్డి అనే హెల్త్ కౌన్సిలర్.. బతకడానికి అవకాశాల్లేవని ట్రీట్‌మెంట్ ఆపేస్తారా.. ఇలాంటి సందర్భాన్ని చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు వెళ్లే ముందు టెక్నికల్-సైంటిఫిక్ కమిటీ నుంచి త్వరగా కోలుకుంటారని… చికిత్సకు రెస్పాండ్ అవుతారని సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే వైద్యం అందిస్తారట. చైనాను మినహాయించి ఇటలీ లాంటి దారుణమైన పరిస్థితులు ఎక్కడా లేవు. అక్కడి ఐసీయూల కెపాసిటీ కంటే కరోనా బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉందట. 

గత వారానికి కరోనా కేసులు తగ్గకపోగా.. పెరుగుతున్నాయి. ఆదివారం 368కొత్త కేసులు నమోదవగా.. ఒక్కరోజులో ఎక్కువ కేసులు నమోదు చేసిన దేశంగా ఇటలీ నిలిచింది. ఇప్పటికీ 25వేల మందికి టెస్టులు చేయగా.. వారిలో 1వెయ్యి 809మృతి చెందారు. చనిపోయిన వారిలో వయస్సు పైబడిన వారే ఉన్నారనుకుంటే పొరబాటే. వయో వృద్ధులు అధికంగా ఉన్న యూరప్‌లో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నాయి. 

కరోనా వైరస్ ప్రభావం.. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండేవాళ్లపై ఎక్కువగా పనిచేస్తుందనేది వాస్తవమే కానీ, ఆ కారణంతో చికిత్స ఆపేయడమనేది దారుణమే.