జపాన్ లో జైశ్రీరామ్,భారత్ మాతా కీ జై నినాదాలు

జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.
అయితే మంగళవారం(సెప్టెంబర్-3,2019) రాజ్ నాథ్ సింగ్ జపాన్ రాజధాని టోక్యోకు చేరుకోగానే జైశ్రీరామ్,భారత్ మాతా కీ జై,వందే మాతరం నినాదాలు హోరెత్తాయి. రాజ్ నాథ్ వారందరికీ నమస్కరిస్తూచిరునవ్వులు చిందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సియోల్ లో రాజ్ నాథ్ పర్యటన కొనసాగుతోంది. కొరియా దేశం కోసం ప్రాణాలు అర్పించినవారికి రాజ్ నాథ్ ఇవాళ(సెప్టెంబర్-5,2019)నివాళులర్పించారు. సియోల్ లోని వార్ మెమోరియల్ ను సందర్శించారు.
WATCH: ‘Jai Sri Ram’, ‘Vande Mataram’ and ‘Bharat Mata ki Jai’ slogans raised as Defence Minister Rajnath Singh arrives in Tokyo,Japan (September 3) pic.twitter.com/OeN1cbz3t5
— ANI (@ANI) September 5, 2019