Jaishankar: పాకిస్థాన్‌లో మార్నింగ్ వాక్ చేసి.. మొక్కను నాటిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఫొటోలు వైరల్

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

Jaishankar: పాకిస్థాన్‌లో మార్నింగ్ వాక్ చేసి.. మొక్కను నాటిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఫొటోలు వైరల్

External Affairs Minister Jaishankar

Updated On : October 16, 2024 / 11:34 AM IST

SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO Summit 2024)లో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం పాకిస్థాన్ వెళ్లారు. బుధవారం ఉదయం ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ క్యాంపస్ లో జైశంకర్ మార్నింగ్ వాక్ చేశారు. ఆ సమయంలో అతనితో పాటు పాకిస్థాన్ లోని భారత హైకమిషన్ సిబ్బంది ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను జైశంకర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్  జట్టు సహచరులతో మార్నింగ్ వాక్ అంటూ రాశారు. మార్నింగ్ వాక్ అనంతరం భారత హైకమిషన్ క్యాంపస్ లో అర్జున మొక్కను విదేశాంగ మంత్రి నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Also Read: భారత్-కెనడా మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ట్రూడో ఆరోపణల వెనుక వ్యూహం ఉందా?

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్ లో అప్పటి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ లో పర్యటించారు. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ కాలమానం ప్రకారం జైశంకర్ విమానం మంగళవారం సాయత్రం 3.30 గంటలకు ఇస్లామాబాద్ శివారులోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో దిగింది. అనంతరం ఆ దేశ ఉన్నతాధికారులు జైశంకర్ కు స్వాగతం పలికారు. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ లో అడుగుపెట్టిన సభ్యదేశాల ప్రతినిధులకు పాక్ ప్రధాని మంగళవారం రాత్రి తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్, షెహబాజ్ లు కరచాలనం చేసుకొని కొద్దిసేపు ముచ్చటించారు.