Joe Biden: దీనిలో అమెరికన్లు కూరుకుపోతున్నారు: ఫేర్‌వెల్ స్పీచ్‌లో బైడెన్ కీలక వ్యాఖ్యలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు రక్షణ ఉండాలని, అలాగే, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో వాటి పాత్రకు వాటినే జవాబుదారీగా చేయాలని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ ఫేర్‌వెల్ స్పీచ్ ఇచ్చారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఇవాళ బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. తప్పుడు సమాచార హిమపాతంలో అమెరికన్లు కూరుకుపోతున్నారని ఆయన కవితాత్మకంగా చెప్పారు.
ఒక వ్యవస్థగా మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని బైడెన్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు రక్షణ ఉండాలని, అలాగే, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో వాటి పాత్రకు వాటినే జవాబుదారీగా చేయాలని చెప్పారు.
కొన్ని శక్తుల నుంచి వాతావరణ మార్పుల పాలసీలకు ముప్పు ఉందని బైడెన్ అన్నారు. అమెరికాలో సంపద, అధికారం, ప్రభావవంత శక్తులతో రాజ్యాధిపత్యం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ప్రమాదముందని తెలిపారు. అమెరికా ఆదర్శాలను నమ్మడం అంటే స్వేచ్ఛాయుత సమాజాన్ని పరిపాలించే వ్యవస్థలను గౌరవించడమని అన్నారు.
ఆ వ్యవస్థలే ప్రెసిడెన్సీ, కాంగ్రెస్, కోర్టులు, మీడియా స్వేచ్ఛ అని బైడెన్ తెలిపారు. కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వం వహించాలని, అలాగే, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు సురక్షిత విధానలను పరిచయం చేయాలని చెప్పారు.
Bangladesh: రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సోషలిజాన్ని తొలగించాలని బంగ్లాదేశ్ కమిషన్ ప్రతిపాదన