Kamala Haris: గంటన్నర పాటు ప్రెసిడెంట్‌గా కమలాహారిస్.. తొలి మహిళగా రికార్డు
ఒకేఒక్కడు సినిమాలో హీరో ఒక్కరోజు సీఎం అయినట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ గంటన్నర ప్రెసిడెంట్ కానున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు...

Kamala Haris
Kamala Haris: ఒకేఒక్కడు సినిమాలో హీరో ఒక్కరోజు సీఎం అయినట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ గంటన్నర ప్రెసిడెంట్ కానున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలికంగా బదిలీ చేయనున్నట్లు వైట్ హౌజ్ వెల్లడించింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆ కాసేపు సమయం అందుబాటులో లేకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఏటా పెద్ద పేగుకు సంబంధించి బైడెన్‌కు కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో కచ్చితంగా మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుంది. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలోనూ అవసరమైన ప్రెసిడెంట్ సేవలు అందించడానికి వీలుగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు కమలాహారిస్ అందుకోనున్నారు.
ఇలా యూఎస్ ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు సృష్టించనున్నారు. ‘రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి అధ్యక్షుడు బైడెన్ అనస్తీషియాలో ఉండే కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారు’ అని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
…………………………………….. : సీఎం జగన్‌కి ఫోన్ చేసిన పీఎం మోదీ
ఇలా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో అధికారాన్ని ఉపాధ్యక్షుడికి రెండు సార్లు బదిలీ చేశారు.