Ken Burns And Zuckerberg : అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్ బర్గ్, జైళ్లో పడేయండి
అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్ బర్గ్..ముందు అతడిని జైళ్లో పడేయాలంటూ...తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కెన్ బర్న్స్. ఫేస్ బుక్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Fb
Ken Burns : అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్ బర్గ్..ముందు అతడిని జైళ్లో పడేయాలంటూ…తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కెన్ బర్న్స్. ఫేస్ బుక్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా చరిత్రలో జుకర్ బర్గ్ అంతటి ద్రోహి మరొకరు ఉండరని, ఫేస్ బుక్ లో తప్పుడు సమాచారం ఇస్తూ..ప్రజలను పిచ్చోళ్లు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.
Read More : Book Of Records : 20 నెలల చిన్నారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
ఫేస్ బుక్ పోస్టులతో మనుషుల మానసికస్థితితో ఆడుకుంటున్నాడని, అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అతని సహోద్యోగిణి షెరిల్ శాండ్ బర్గ్ (ఫేస్ బుక్ సీవోవో)ను కూడా లాక్కెళ్లి జైళ్లో వేయాలని వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత..నాజీలను న్యూరెంబర్గ్ దగ్గర ఎలా విచారించారో అలా వీళ్లను కూడా విచారించాలని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బర్న్ విషయానికి వస్తే…రెండుసార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. బర్న్ డెమొక్రటిక్ మద్దతుదారుడు.
Read More : Amazon : అమెజాన్‌లో ఆఫర్ల ఫెస్టివల్