Khaby Lame: యాంటీ రేసిజం పోస్టు పెట్టాడు.. ఫాలోవర్లు కోల్పోయాడు!

టిక్ టాక్ స్టార్ ఖాబీ లేమ్ యాంటీ రేసిజం వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్లలో రేసిజం పోస్టు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Khaby Lame: యాంటీ రేసిజం పోస్టు పెట్టాడు.. ఫాలోవర్లు కోల్పోయాడు!

Tiktok's Second Biggest Star, Khaby Lame

Updated On : October 8, 2021 / 6:32 PM IST

Khaby Lame : ప్రపంచ టిక్ టాక్ స్టార్ ఖాబీ లేమ్ (Khaby Lame) యాంటీ రేసిజం వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్లలో రేసిజం వ్యాఖ్యలు చేయడంతో 21ఏళ్ల ఖాబీ లేమ్‌ను నెటిజన్లు ఏకిపారేశారు. ప్రపంచవ్యాప్తంగా 115 మిలియన్ల మంది టిక్ టాక్ ఫాలోవర్లతో సెకండ్ మోస్ట్ పాపులర్ క్రియేటర్‌గా పేరొందిన ఖాబీ లేమ్ నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, టెస్లా వంటి సంస్థలే జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఖాబీలేమ్ కూడా సే టూ నో రేసిజం అని తన అకౌంట్లో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఆ పోస్టు చూసిన నెటిజన్లు అతడిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chameleon Diamond: రంగులు మారుస్తున్న వజ్రం..సైటిస్టులు సైతం షాక్

ఖాబీ లేమ్ ఆఫ్రికన్‌ దేశంలోని సెనెగలీస్​లో జన్మించాడు. ఇటలీలోని చివాస్సో లో పెరిగాడు. గ్రాడ్యుయేషన్​ వరకు చదివాడు. పోయిన ఏడాది వరకు అతడో సాధారణ వ్యక్తి.. ఖాబీలేమ్‌ వరల్డ్‌ ఫేమస్‌ అయ్యాడు. చిత్రమైన ఎక్స్‌ప్రెషన్లతో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుండేవాడు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో అతడి దశ తిరిగింది.

115 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ వచ్చారు. అంతేకాదు.. స్పాన్సర్ల రూపంలో డబ్బులు వచ్చి పడ్డాయి. ఇటలీలో టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ గట్టిగానే సంపాదిస్తున్నాడు. ఇన్‌ స్టాగ్రామ్‌లో ఖాబీ లేమ్ చేసిన పోస్ట్‌ చేయడంతో అతడ్ని ఫాలో అయిన ఫాలోవర్లే ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. ఫాలోవర్స్‌ ఒక్కొక్కరుగా ఖాబీలేమ్‌ను అన్ ఫాలో అయిపోతున్నారు.
Mumbai Drug Bust Case : ఆర్యన్‌కు షాక్.. మళ్లీ బెయిల్ నిరాకరణ..!