కిమ్ ఎక్కడున్నాడు ? ఆ రైలు ఎవరిది
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షేమంగా ఉన్నారా ? ఉంటే ఎక్కడున్నారు ? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా ? లేక విషమించిందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కిమ్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. పలు దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షేమంగా ఉన్నారా ? ఉంటే ఎక్కడున్నారు ? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా ? లేక విషమించిందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కిమ్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. పలు దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే దానిపై చర్చనీయాంశమైంది. తాజాగా…వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న 38 నార్త్ అనే వెబ్ సైట్ వెల్లడించిన కథనం దుమారం రేపుతోంది.
38 నార్త్ ఇటీవలే శాటిలైట్ చిత్రాలు తీసింది. తూర్పు తీరంలో ఉన్న కిమ్ హాలిడే స్పాట్ అయిన వోన్ సన్ రిసార్ట్స్ రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఆగి ఉన్నట్లు ఆ చిత్రాల్లో కనిపించింది. ఇది పక్కాగా కిమ్ దే అయింటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ స్టేషన్ ను కిమ్, అతని కుటుంబసభ్యులు మాత్రమే ఉపయోగిస్తుంటారని 38 నార్త్ ప్రాజెక్టు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కానీ ఆయన మాత్రం అక్కడే ఉంటారని స్పష్టంగా చెప్పలేమంటున్నారు.
ఇదిలా ఉంటే…కిమ్ అనారోగ్యానికి సంబంధించిన వార్తలను కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కొట్టిపారేస్తోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు కిమ్ సందేశం పంపించారనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్ ఆరోగ్య పరిస్థితులపై అనేక రకాల కథనాలు వెల్లడవుతున్నాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.