King Charles III: ప్రపంచ దృష్టి మొత్తం కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం మీదే.. మేఘన్ మార్కెల్ మాత్రం హాజరుకాలేదు

King Charles III: హ్యారీ, మేఘన్ ఇద్దరూ రాజకుటుంబాన్ని 2020లో వీడి అమెరికా వెళ్లిపోయారు. ఇవాళ కూడా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు.

King Charles III: ప్రపంచ దృష్టి మొత్తం కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం మీదే.. మేఘన్ మార్కెల్ మాత్రం హాజరుకాలేదు

Prince Harry arrives alone

Updated On : May 6, 2023 / 5:50 PM IST

King Charles III: ప్రపంచ దృష్టి మొత్తం కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం మీద ఉన్న వేళ ఆయన చిన్న కోడలు మేఘన్ మార్కెల్ (Meghan Markle) ఈ మహోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాజకుటుంబంలోని విభేదాలు మరోసారి బటయపడ్డాయి. డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్, పిల్లలు లేకుండానే డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ (Prince Harry) ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రిన్స్ హ్యారీ ఈ వేడుకకు హాజరు అవుతున్నారని, ఆయన భార్య మేఘన్ మార్కెల్ అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఉండిపోతున్నారని అంతకు ముందే బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన చేసింది. పిల్లలు ప్రిన్స్ ఆర్చీ, ప్రిన్సెస్ లిలిబెట్ కూడా ఆమెతోనే ఉంటారని స్పష్టం చేసింది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II (Queen Elizabeth) గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూసిన సమయంలో ప్రిన్స్ హ్యారీ ఇంగ్లండ్ కు వచ్చారు.

Prince Harry

Prince Harry

విభేదాలు ఎవరితో?

హ్యారీ, మేఘన్ ఇద్దరూ రాజకుటుంబాన్ని 2020లో వీడి అమెరికా వెళ్లిపోయారు. ఇవాళ కూడా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు. ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రిన్స్ హ్యారీకి ఆయన అన్న విలియమ్స్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేఘన్ మార్కెల్ రాజ కుటుంబానికి దూరంగా ఉంటూ, నేటి వేడుకకు హాజరుకాలేదన్న ప్రచారం జరుగుతోంది.

నేడు ప్రిన్స్ ఆర్చీ బర్త్ డే..
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆర్చీ ఇవాళ నాలుగో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇదే రోజున ప్రిన్స్ ఆర్చీ తాత కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం జరుగుతుండడం గమనార్హం. ప్రిన్స్ ఆర్చీ పుట్టినరోజు ఉండడంతోనే మేఘన్ మార్కెల్ ఇవాళ కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి హాజరుకాలేకపోయారని కథనాలు వస్తున్నాయి. రెండు తేదీలు ఒకే రోజు ఉండడంతో దీనిపై మాటల యుద్ధం కూడా చోటుచేసుకుందని ప్రచారం జరుగుతోంది.

King Charles III Video: ఈ కాలంలో చూడలేమనుకున్న అద్భుత దృశ్యం.. బంగారు రథంపై రాజు, రాణి ఊరేగింపు, పట్టాభిషేకం