నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఒలి ప్రమాణస్వీకారం

నేపాల్ పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిగా కెపి శర్మ ఒలి అవతరించారు. దీంతో గురువారం తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు, ఆధిపత్య పోరులో చిక్కుకున్న

నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఒలి ప్రమాణస్వీకారం

Kp Sharma Oli Reappointed As Nepal Pm

Updated On : May 14, 2021 / 9:40 AM IST

KP Sharma Oli: నేపాల్ పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిగా కెపి శర్మ ఒలి అవతరించారు. దీంతో గురువారం తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు, ఆధిపత్య పోరులో చిక్కుకున్న ప్రతిపక్ష పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సభలో మెజారిటీ సీట్లను పొందడంలో విఫలమయ్యాయి.

దీంతో సిపిఎన్-యుఎంఎల్ చైర్మన్ ఒలి (69) ను ప్రధానిగా అధ్యక్షులు బిడియా దేవి భండారి సోమవారం ప్రతినిధుల సభలో తిరిగి నియమించారు. నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 78 (3) ప్రకారం ప్రతినిధుల సభలో అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఒలిని తిరిగి ప్రధానమంత్రిగా నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం గురువారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. శుక్రవారం శిటల్ నివాస్‌లో జరిగే కార్యక్రమంలో ఒలీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.