Covid-19 Lambda Variant: లాంబ్డా వేరియంట్‌ను సీరియస్‌గా తీసుకోమంటోన్న WHO

‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్‌’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Covid-19 Lambda Variant: లాంబ్డా వేరియంట్‌ను సీరియస్‌గా తీసుకోమంటోన్న WHO

Who (1)

Updated On : June 28, 2021 / 9:55 AM IST

Covid-19 Lambda Variant: కరోనా వైరస్ వ్యాక్సిన్ల ప్రొడక్షన్.. వ్యాక్సినేషన్ కు పట్టే సమయంలో పావు వంతు కూడా తీసుకోవడం లేదు వేరియంట్లు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లు దాటి కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్ ను ముందుగా తేలికగా తీసుకున్నా.. అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో దీన్ని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ.

బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్‌’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. ముందుగా ఇది గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కోవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. 60 రోజులుగా చిలీలో 32 శాతానికి పెరిగింది.

ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్‌ఈ పేర్కొంది. దీని స్పైక్‌ ప్రొటీన్‌లోని ఉత్పరివర్తనల వల్ల వ్యాప్తి ఎలా ఉండబోతుందనేది.. మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీహెచ్‌ఈ వివరించింది.

పీహెచ్ఈ వెల్లడించిన లక్షణాలివే..

* అధిక ఉష్ణోగ్రత
* ఆగకుండా దగ్గు
* వాసన లేదా రుచి కోల్పోవడం