నీచ స్థితికి దిగజారుతున్న పాకిస్థాన్.. యుద్ధంలోకి మదర్సా పిల్లలను దించుతామన్న పాక్ రక్షణ మంత్రి
పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Pakistan Defense Minister Khawaja Asif
India Pakistan Tension: పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకాలం కేవలం ఉగ్రదాద సంస్థలే మదర్సాలలో పిల్లలకు విద్వేష పాఠాలు నేర్పించి వారిని టెర్రరిస్టులుగా తయారు చేస్తుంటే.. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్ ప్రభుత్వమే వారిని యుద్ధంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. సాక్షాత్తూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన చేశారు. ‘మదర్సాలు, మదర్సాలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. వాళ్లు కచ్చితంగా మన సెకండ్ లైన్ డిఫెన్స్. అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా 100 శాతం ఆ విద్యార్థులను రంగంలోకి దింపుతాం’ అని ఖవాజా అసిఫ్ ప్రకటించారు.
Also Read: భారత్ -పాక్ మధ్య యుద్ధం తలెత్తితే.. చైనాకు కూడా భారీ నష్టం జరుగుతుందా.. ఎలా అంటే..?
మరోవైపు పాకిస్థాన్ మీద భారత్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. అయితే, వాటిని నిలువరించడానికి పాకిస్థాన్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీనికి కారణంకూడా ఉందని ఖవాజా తెలిపారు. తాము తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉందో బయటపెట్టదలుచుకోలేదని.. అందుకే భారత డ్రోన్లను కౌంటర్ చేయలేదని చెప్పారు. ‘మా ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వాళ్లు ఆ డ్రోన్లు ప్రయోగించారు. కానీ, మేం వాటిని కౌంటర్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కొంచెం టెక్నికల్ అంశం. అయితే, మా ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో తెలియకుండా ఉండేందుకే ఇలా చేశాం.’ అని పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్రకటించారు.
మరోవైపు భారత్ మీద దాడులు చేయడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. జమ్మూ, శ్రీనగర్, రాజస్థాన్, పంజాబ్ లో దాడులు చేయగా,భారత్ వాటిని సమర్థంగా ఎదుర్కొంది. ఇండియాపై ఇప్పటి వరకు డ్రోన్లతో దాడి చేస్తున్న పాకిస్థాన్ ఇఫ్పుడు ఆర్మీని బోర్డర్ లోకి పంపుతోంది. పాక్ ఆర్మీ బలగాలు సరిహద్దులకు దగ్గరగా తరలిస్తున్నట్టు ఇండియాకు సమాచారం ఉందని, తాము అలర్ట్ గా ఉన్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది.