Earthquake Strikes France:ఫ్రాన్స్‌లో భారీ భూకంపం
ఫ్రాన్స్ దేశంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల ఫ్రాన్స్ దేశంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సీస్మాలజీ బ్యూరో తెలిపింది....

ఫ్రాన్స్ దేశాన్ని వణికించిన భూకంపం
Earthquake Strikes France: ఫ్రాన్స్ దేశంలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం వల్ల ఫ్రాన్స్ దేశంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సీస్మాలజీ బ్యూరో తెలిపింది.(Earthquake Strikes France) మెయిన్ ల్యాండ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం అని ఫ్రాన్స్ దేశ ఎకాలజీ ట్రాన్సిషన్ మంత్రి క్రిష్టపీ బేచూ చెప్పారు.
2000వ సంవత్సరంలోనూ ఫ్రాన్స్ దేశంలో భూకంపం సంభవించింది. ఫ్రాన్స్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని ఫ్రెంచ్ సెంట్రల్ సీస్మాలజీ బ్యూరో వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఒకరు గాయపడ్డారని, అతనికి ఆసుపత్రిలో చికిత్స చేయించామని మంత్రి చెప్పారు. పలు భవనాల గోడల్లో పగుళ్లు వచ్చాయి.
Cyclone Biparjoy Expected To Weaken: బిపర్‌జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనం
భూకంపం వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో 1100 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2019లో డ్రోమ్‌లోని ఆగ్నేయ విభాగంలో చివరిగా నమోదైన భూకంపాలు ఫ్రాన్స్‌లో ఐదు కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించడం చాలా అరుదు.ఈ సారి భారీ భూకంపం రావడంతో ఫ్రాన్స్ ప్రజలు వణికిపోయారు.